నిజమా?: హరీష్ రావుతో భేటీకి కేసిఆర్ నో
కేసిఆర్ ను కలవడానికి గత వారం రోజులుగా హరీష్ రావు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, కేసిఆర్ ఆయనను కలవడానికి కేసిఆర్ ఇష్టపడడం లేదని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
హైదరాబాద్: ఆపద్ధర్మ మంత్రి, తన మేనల్లుడు హరీష్ రావుకు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది. కేసిఆర్ తో హరీష్ రావుకు దూరం పెరిగిందనే వార్తల నేపథ్యంలో ఆ ప్రచారం సాగుతోంది.
కేసిఆర్ ను కలవడానికి గత వారం రోజులుగా హరీష్ రావు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, కేసిఆర్ ఆయనను కలవడానికి కేసిఆర్ ఇష్టపడడం లేదని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, ఇందులో ఎంత వరకు నిజం ఉందనేది తెలియదు.
కాగా, కేసిఆర్ ప్రస్తుతం ఫామ్ హౌస్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేయడంలో, అసమ్మతి నేతలను బుజ్జగించడంలో ఆయన మునిగిపోయినట్లు చెబుతున్నారు.
హరీష్ రావుతో పాటు ఆయనకు సన్నిహితులని భావిస్తున్నవారికి టికెట్లు నిరాకరిస్తే సంభవించే పరిణామాలపై కూడా ఆయన ఓ అంచనాకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
సంబంధిత వార్తలు
హరీష్ టార్గెట్, కేటిఆర్ కు రస్తా: కేసిఆర్ ప్లాన్ ఇదీ...
కారులో హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి: సిద్ధిపేటపై కేసిఆర్ కన్ను
హరీష్ వేదాంత ధోరణి: గులాబీ గూడు చెదురుతోందా?
పొలిటికల్ రిటైర్‌మెంట్‌పై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్‌కు ఓటేస్తే...: ఏపీకి ప్రత్యేక హోదాపై హారీష్ ట్విస్ట్