పొలిటికల్ రిటైర్‌మెంట్‌పై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

తన పొలిటికల్ రిటైర్‌మెంట్‌పై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సిద్ధిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో జరిగిన సభలో హరీశ్ రావు పాల్గొన్నారు. 

Harish rao sensational comments on his political retirement


తన పొలిటికల్ రిటైర్‌మెంట్‌పై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సిద్ధిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో జరిగిన సభలో హరీశ్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీ ప్రేమ, అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని.. ఆదరణ ఉన్నప్పుడే గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఉందన్నారు. ఈ జన్మకు తనకు ఇది చాలని అన్నారు. అనంతరం కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

తెలంగాణ ఏర్పాటు విషయంలో గులాంనబీ ఆజాద్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితంగానే తెలంగాణ ప్రకటన వెలువడిందని.. ప్రత్యేకరాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదని ఆరోపించారు. ఢిల్లీ మెడల వంచి తెలంగాణను తెచ్చుకున్నామని... గులాబీ జెండా లేకపోతే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు..

తెలంగాణకు ప్రత్యేకహోదాపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం ఏమిటని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా తాము హరీశ్‌రావుకు ఓటు వేస్తామని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేటీఆర్‌ కింద తాను పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించడం.. ఇటీవల తన శాఖ, తన పని తప్పించి ఇతర విషయాలను హరీశ్ రావు పట్టించుకోకపోవడం.. పార్టీలో చర్చనీయాంశమైంది.

తాజాగా గ్రామస్తుల ప్రేమ, అప్యాయత వల్ల ఉద్వేగంతో ఆ మాట అన్నారా లేదంటే మనుసులో ఉన్నదే బయటకు చెప్పారా..? అన్న దానిపై తెలంగాణ భవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios