కన్నకొడుకును, కట్టుకున్న భర్తను వదిలి ఓ వివాహిత అదృశ్యమయ్యింది. భర్త ఇంట్లో లేని సమయంలో చిన్నారిని వదిలేసి కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ కేసు మిస్టరీగా మారింది. 

సంగారెడ్డి : ఏమైందో తెలియదు. యేడాదిన్నర చిన్నారిని ఒంటరిగా వదిలేసింది.. వేరే ఊరికి వెళ్లిన భర్త వచ్చేలోపే కనిపించకుండా పోయింది. ఊరినుంచి వచ్చిన ఆ భర్తకు ఇంట్లో చిన్నారి ఒక్కడే ఏడుస్తూ కనిపించడంతో హతాశుడయ్యాడు. భార్య కోసం ఎంతో వెతికాడు. కానీ ఫలితం లేకపోయింది. ఓ వివాహిత సడన్ గా అదృశ్యమైనట్లు సంఘటన sangareddy పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. శనివారం సిఐ రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కిష్టయ్య గూడెంకు చెందిన ఆంజనేయులు, నందిని couple. వీరు పట్టణం పరిధిలోని భవాని నగర్ లో నివాసం ఉంటున్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మార్చి 10వ తేదీన ఆంజనేయులు పని నిమిత్తం hyderabad కి వెళ్ళాడు.తిరిగి ఇంటికి వచ్చేసరికి ఏడాదిన్నర బాబు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. నందిని ఇంట్లో కనిపించలేదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, బంధువులు, తెలిసినవారిని విచారించి ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో భర్త ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. ఆమె ఆచూకీ తెలిసినవారు.. 94906 17010, 0845527633 నెంబర్లకు తెలియజేయాలన్నారు. 

ఇదిలా ఉండగా..Tamilanaduలోని తిరువొత్తియూరులో దారుణం జరిగింది. తన కోరిక తీర్చలేదని తమ్ముడి భార్యను హత్యచేసి దహనం చేశాడో కిరాతకుడు. ఆమెతో పాటు రెండేళ్ల చిన్నారినీ హత్య చేసి కాల్చేశాడు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. దిండుక్కల్ జిల్లా నత్తం సమీపంలోని మలయనూర్ ప్రాంతానికి చెందిన నల్లపిచ్చన్ కుమారులు karuppaiya (30), శివకుమార్ (27). వీరిలో కరుప్పయ్యకు వివాహం కాలేదు. శివ కుమార్ కు anjali (21)తో వివాహం జరిగింది. వీరికి మలర్ (2) కుమార్తె ఉంది. కాగా ప్రస్తుతం అంజలి నాలుగు నెలల గర్భిణీ.

శనివారం శివకుమార్ చింతపండు వ్యాపారం కోసం బయటి ఊరికి వెళ్ళాడు. సాయంత్రం సమయంలో అదే ప్రాంతంలో ఉన్న తోటలో చిన్నారి మలర్ వితితో కలిసి anjali మేకలు కాస్తూ ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన కరుప్పయ్య ఒంటరిగా ఉన్న అంజలిని చూసి తన కోరిక తీర్చమని ఒత్తిడి చేశాడు. దీనికి అంజలి తిరస్కరించడంతో కరుప్పయ్య కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో తీవ్ర గాయాలతో ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. తరువాత బిడ్డ మలర్ విలిని కూడా అతను నరికి హత్య చేశాడు. 

తర్వాత ఇద్దరి మృతదేహాలకు నిప్పు పెట్టి పారిపోయాడు. మంటలతో పొగ అలుముకుంది. అది చుట్టు పక్కల ప్రాంతాలకు కూడా కనిపించసాగింది. దీంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూశారు. ఇద్దరు మృతదేహాలు కాలిపోతున్నట్లు గుర్తించి ..పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు కరుప్పయ్యను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.