ఆన్‌లైన్ లోన్ యాప్ దారుణం: హైద్రాబాద్ మహిళ ఫోటో న్యూడ్‌గా మార్ఫింగ్ చేసి షేర్, మనీష్ కుమార్ అరెస్ట్

ఆన్ లైన్ లోన్ యాప్ ల దారుణాలు ఆగడం లేదు. సకాలంలో ఈఎంఐలు చెల్లించలేదని ఓ మహిళ ఫోటోను న్యూడ్ గా మార్పింగ్ చేసి బంధువులు, స్నేహితులకు షేర్ చేసిన మనీష్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Loan app executive arrested for harassing woman in Hyderabad

హైదరాబాద్: Online లోన్ యాప్  నిర్వాహకుల దారుణాలు ఆగడం లేదు. సకాలంలో EMI చెల్లించలేదని  ఓ Woman ఫోటోను మార్పింగ్ చేసి Nudeగా  మార్చారు ఆన్ లైన్ యాప్ నిర్వాహకులు.  అంతేకాదు ఈ ఫోటోను బాధితురాలి బంధువులు, స్నేహితులకు షేర్ చేశారు. బాధితురాలి ఫోటోను మార్పింగ్ చేసి షేర్ చేయడంతో పాటు ఆమెకు ఫోన చేసి ఫోన్ లో కూడా వేధింపులకు గురి చేసినట్టుగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2021లో Cyber crime పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే  బాధితురాలి ఫోటోను షేర్ చేసిన ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. చివరిని నిందితుడిని గుర్తించారు. Bihar రాష్ట్రంలోని సింహాన్ జిల్లా గోపాల్‌పూర్ కోటి గ్రామానికి చెందిన మనీష్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలో బాధిత మహిళ పలు ఆన్ లైన్ లోన్ యాప్ ల నుండి లోన్లు తీసుకుంది. సకాలంలో ఈఎంఐ చెలలించేందుకు డబ్బులు సర్ధుబాటు కాలేదు.దీంతో బాధిత మహిళ ఈఎంఐ చెల్లించలేదు.దీంతో బాధితురాలి ఫోటోను న్యూడ్ గా మార్పింగ్ చేసి షేర్ చేశాడు. 

ఆన్‌లైన్ యాప్ లు క్షణాల్లో అప్పులు ఇస్తారు. అయితే ఈ అప్పును సకాలంలో చెల్లించకపోతే వేధిస్తారు. ఇదే తరహలో హైద్రాబాద్ కు చెందిన  మహిళ ఆన్ లైన్ లోన్ యాప్ ద్వారా రుణం తీసుకుంది. ఈ రుణానికి సంబంధించిన ఈఎంఐని మాత్రం ఇంకా చెల్లించలేదు. దీంతో బాధితురాలి ఫోటోను మార్పింగ్ చేసి న్యూడ్ గా మార్చి  ఆమె బంధువులు, స్నేహితులకు షేర్ చేశాడు.ఈ విషయాన్ని ఆమె బంధువులు బాధితురాలి దృష్టికి తీసుకు వచ్చారు. ఈఎంఐ చెల్లించలేదని  తన ఫోటో ను న్యూడ్ గా మార్పింగ్ చేసి షేర్ చేసినట్టుగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు మేరకు మనీష్ కుమార్ ను అరెస్ట్ చేశారు.

 ఇదే తరహాలో వేధింపులు భరించలేక గతంలో పలువురు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు తెలుగు రాస్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. Telangana, Andhra Pradesh రాష్ట్రాల్లో ఈ తరహా ఘంటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులు పెద్ద ఎత్తున ఆన్ లైన్ లోన్ యాప్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. అంతేకాదు ఈ లోన్ యాప్  ల వెనుక China  కంపెనీలు ఉన్న విషయాన్నికూడా తెలంగాణ పోలీసులు బట్టబయలు చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios