కేటీఆర్,హరీష్‌రావులు  ఓకే వేదికను పంచుకోవడం ద్వారా  టీఆర్ఎస్‌లో ఎలాంటి  విబేధాలు లేవనే చెప్పే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో  వీరిద్దరూ కూడ ఒకే వేదికను పంచుకోవడం ద్వారా రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. 

సిరిసిల్ల: కేటీఆర్,హరీష్‌రావులు ఓకే వేదికను పంచుకోవడం ద్వారా టీఆర్ఎస్‌లో ఎలాంటి విబేధాలు లేవనే చెప్పే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో వీరిద్దరూ కూడ ఒకే వేదికను పంచుకోవడం ద్వారా రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. 

పార్టీలో కానీ, కుటుంబంలో కానీ ఎలాంటి బేధాబిప్రాయాలు లేవని ఈ సమావేశం ద్వారా చెప్పే ప్రయత్నం చేశారని రాజీకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తంగా రాజకీయ ప్రత్యర్థులకు ఈ సమావేశం ద్వారా కేటీఆర్, హరీష్ రావు చెక్ పెట్టారు.

సిరిసిల్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్ రావుపై కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. తమ మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రజలకు వివరించారు. అటు హరీష్ రావు సైతం కేటీఆర్ ను ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇద్దరు నేతలు ఒకరినొకరు ప్రశంసించుకోవడం, ఆలింగనం చేసుకోవడం తామంతా ఒక్కటేనని చెప్పడంతో ప్రత్యర్థి పార్టీల నోర్లు మూయించే ప్రయత్నం చేశారు.

 టీఆర్ఎస్ పార్టీలో తమ మధ్య పోరు లేదని అభివృద్ధిలో మాత్రం పోటీ ఉందని ఇరు నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తాము పోటీ పడుతున్నామని తెలిపారు. కేసీఆర్ మరో 15ఏళ్లపాటు సీఎంగా ఉండాలన్నదే తమ ఇద్దరి ఆకాంక్ష అని కేటీఆర్, హరీష్ రావు మనసులో మాట బయటపెట్టారు. 

ఇకపోతే తెలంగాణ రాష్ట్రసమితిలో ఇంటిపోరు మెుదలైందని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ముందస్తు ఎన్నికలే అందుకు నిదర్శనమంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శల దాడి చేశాయి. తెలంగాణలో కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ఆరోపణలు వెల్లువెత్తాయి. 

మరోవైపు హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో తన రిటైర్మెంట్ ప్రకటనపై కూడా పెద్ద ఎత్తునే వివాదం చెలరేగింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావును పొమ్మనలేకే పొగపెడుతున్నారంటూ ప్రచారం జరిగింది. లేనిపక్షంలో హరీష్ రావు అలాంటి వ్యాఖ్యలు చెయ్యరంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే హరీష్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడంతో కాస్త సద్దుమణిగింది. 

టీఆర్ఎస్ లో ఇంటిపోరును క్యాష్ చేసుకునేందుకు కొన్నిపార్టీ, కొందరు నేతలు ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ లో హరీష్ రావుకు ప్రత్యేక వర్గం ఉందని చాలాకాలంగా ప్రచారంలో ఉంది. ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా మాజీమంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. తాను హరీష్ అన్న వర్గం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి కేటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారన్న ప్రచారం ఉంది. తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితా, అసంతృప్తులను బుజ్జగించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీలో కేటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తుండటంతో హరీష్ రావును పక్కకు పెట్టేశారన్న ప్రచారం జరిగింది.

అయితే ఈ వ్యాఖ్యలకు, ఊహాగానాలన్నింటికి కేటీఆర్, హరీష్ రావులు తమదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తమ మధ్య ఇంటిపోరు లేదని అభివృద్ధి పోరుమాత్రమేనంటూ తేల్చి చెప్పేశారు. తాము అన్నదమ్ముల్లా లిసే ఉంటామని...మరో 15 ఏళ్లు కేసీఆర్ సీఎంగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అంటూ చెప్పుకొచ్చారు. 

దాదాపు చాలా కాలం తర్వాత ఒకే వేదికపై బావ బావమరుదులు ఇద్దరూ కలిసి పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడంతో పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు కేటీఆర్, కేసీఆర్ లు ఒకే వేదిక పంచుకోవడం, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పడంతో రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నదమ్ముల్లా పెరిగాం: కేటీఆర్ పై హరీష్ ప్రశంసల జల్లు (వీడియో)

అందులోనే పోటీ: హరీష్‌తో ప్రచారం చేయించుకున్న కేటీఆర్ (వీడియో)

సేఫ్ జోన్ లోకి కేటీఆర్: హరీష్ రావుపై కేసిఆర్ ప్లాన్ ఇదీ...

భావోద్వేగంతోనే రిట్మైర్మెంట్ కామెంట్ చేశా: మంత్రి హరీష్

హరీష్ టార్గెట్, కేటిఆర్ కు రస్తా: కేసిఆర్ ప్లాన్ ఇదీ...

కారులో హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి: సిద్ధిపేటపై కేసిఆర్ కన్ను

హరీష్ వేదాంత ధోరణి: గులాబీ గూడు చెదురుతోందా?

పొలిటికల్ రిటైర్‌మెంట్‌పై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌కు ఓటేస్తే...: ఏపీకి ప్రత్యేక హోదాపై హారీష్ ట్విస్ట్

నిజమా?: హరీష్ రావుతో భేటీకి కేసిఆర్ నో

టీఆర్ఎస్ లో ఇంటి పోరు..హరీశ్ కు పొగబెడుతున్న కేసీఆర్: రఘునందన్ రావు