Asianet News TeluguAsianet News Telugu

అన్నదమ్ముల్లా పెరిగాం: కేటీఆర్ పై హరీష్ ప్రశంసల జల్లు (వీడియో)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయన్న ప్రత్యర్ధుల ప్రచారాన్ని మంత్రులు హరీష్, కేటీఆర్ లు తిప్పికొట్టారు. తాము అన్నదమ్ములా కలిసి పెరిగామని...అలాంటిది తమ మధ్య విభేదాలెలా ఉంటాయని అన్నారు. తాము ఫోటీ పడుతున్న మాట నిజమే కాని అధికారం కోసం కాదని అభివృద్ది కోసం మాత్రమే అని హరీష్ అన్నారు.  

Minister Harish Rao praised KTR in Sultanpur Meeting
Author
Hyderabad, First Published Oct 4, 2018, 4:31 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయన్న ప్రత్యర్ధుల ప్రచారాన్ని మంత్రులు హరీష్, కేటీఆర్ లు తిప్పికొట్టారు. తాము అన్నదమ్ములా కలిసి పెరిగామని...అలాంటిది తమ మధ్య విభేదాలెలా ఉంటాయని అన్నారు. తాము ఫోటీ పడుతున్న మాట నిజమే కాని అధికారం కోసం కాదని అభివృద్ది కోసం మాత్రమే అని హరీష్ అన్నారు.  

బేగంపేటలోని మంత్రి కేటీఆర్ నివాసంలో జరిగిన సిరిసిల్ల నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో హరీష్ పాల్గొన్నారు.  సిరిసిల్ల నియోజకవర్గం నుండి కేటీఆర్ మరోసారి పోటీకి సిద్దమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హరిష్ మాట్లాడుతూ... కేటీఆర్ పై ప్రశంసలు కురిపించారు. అభివృద్ధి పథంలో సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలు పోటీపడి ముందుకు పోతున్నాయని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించిన అభివృద్ధి యజ్ఞాన్ని సిద్దిపేటలో తాను కొనసాగిస్తున్నానని హరీష్ తెలిపారు. 

సిద్దిపేట అభివృద్ధి వెనుక 30 సంవత్సరాల శ్రమ ఉందని గుర్తుచేశారు. అయితే సిద్దిపేట స్థాయి అభివృద్ధిని మంత్రి కేటీఆర్ గత నాలుగేళ్లలోనే సిరిసిల్లలో చేసి చూపించే ప్రయత్నం చేశారని అభినందించారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం దేశ విదేశాల్లో పర్యటిస్తూ విజయవంతంగా తన శాఖను నిర్వహిస్తూనే మరోవైపు సిరిసిల్ల అభివృద్ధి పదంలో అగ్రస్థానంలో నిలిపారన్నారు. ముఖ్యమంత్రి అప్పచెప్పిన బాధ్యతలను తమ పరిధిలో తాము నిర్వహిస్తున్నామన్నారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు.  మెజార్టీ విషయంలో ను పోటీపడి సిద్దిపేటను దాటేలా నియోజకవర్గ కార్యకర్తలందరూ కృషిచేయాలని కోరారు. తాము అభివృద్ధిలో పోటీ పడుతున్న తీరుగానే కార్యకర్తలు కూడా ఒకరికి ఒకరు పోటీపడి పెద్దఎత్తున ఓటింగ్ శాతం పెరిగేలా కృషి చేయాలన్నారు. 

గత నాలుగేళ్లలో సిరిసిల్ల ఎవరు గుర్తుపట్టలేనంత గొప్పగా మారిపోయిందని, ఒకవైపు పట్టణ అభివృద్ధితోపాటు నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాలను అభివృద్ధి చేయడంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించారన్నారు. ఒకవైపు కాలేశ్వరం నీళ్లు, మరొకవైపు టెక్స టైల్ పార్క్ ద్వారా సిరిసిల్ల రానున్న రోజుల్లో పూర్తిగా రూపాంతరం చెంది సిరుల ఖిల్లా సిరిసిల్ల గా మారుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు.  ఒకప్పుడు ప్రతినిత్యం ఆత్మహత్యల వార్తలతో ఇబ్బంది పడిన సిరిసిల్ల ఈరోజు తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు నేస్తూ వార్తలు నిలుస్తుందన్నారు. గత నాలుగేళ్లలో సిరిసిల్లలో ఆత్మహత్యలు లేవంటే ఆ క్రెడిట్ అంతా మంత్రి కేటీఆర్ దక్కుతుందని ఈ సందర్భంగా హరీష్ రావు తెలిపారు. 

సంబంధిత వార్తలు

సేఫ్ జోన్ లోకి కేటీఆర్: హరీష్ రావుపై కేసిఆర్ ప్లాన్ ఇదీ...

భావోద్వేగంతోనే రిట్మైర్మెంట్ కామెంట్ చేశా: మంత్రి హరీష్

హరీష్ టార్గెట్, కేటిఆర్ కు రస్తా: కేసిఆర్ ప్లాన్ ఇదీ...

కారులో హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి: సిద్ధిపేటపై కేసిఆర్ కన్ను

హరీష్ వేదాంత ధోరణి: గులాబీ గూడు చెదురుతోందా?

పొలిటికల్ రిటైర్‌మెంట్‌పై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌కు ఓటేస్తే...: ఏపీకి ప్రత్యేక హోదాపై హారీష్ ట్విస్ట్

నిజమా?: హరీష్ రావుతో భేటీకి కేసిఆర్ నో

టీఆర్ఎస్ లో ఇంటి పోరు..హరీశ్ కు పొగబెడుతున్న కేసీఆర్: రఘునందన్ రావు

 

Follow Us:
Download App:
  • android
  • ios