Asianet News TeluguAsianet News Telugu

అందులోనే పోటీ: హరీష్‌తో ప్రచారం చేయించుకున్న కేటీఆర్ (వీడియో)

టీఆర్ఎస్ పార్టీలో మంత్రులు హరీష్, కేటీఆర్ ల మధ్య విబేదాలున్నాయంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ప్రచారానికి హరీష్, కేటీఆర్ లు తెరదించారు. ఇద్దరు కలిసి ఒకే వేదికను పంచుకుని ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. తామిద్దరం కేవలం అభివృద్దిలో మాత్రమే పోటీ పడుతున్నామని...అధికారం కోసం కాదని స్పష్టం చేశారు.
 

ktr praises harish rao
Author
Sirsilla, First Published Oct 4, 2018, 4:44 PM IST

టీఆర్ఎస్ పార్టీలో మంత్రులు హరీష్, కేటీఆర్ ల మధ్య విబేదాలున్నాయంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ప్రచారానికి హరీష్, కేటీఆర్ లు తెరదించారు. ఇద్దరు కలిసి ఒకే వేదికను పంచుకుని ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. తామిద్దరం కేవలం అభివృద్దిలో మాత్రమే పోటీ పడుతున్నామని...అధికారం కోసం కాదని స్పష్టం చేశారు.

సిరిసిల్ల కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి హరీష్ రావుకు కేటిఆర్ ధన్యవాదాలు తెలిపారు.  తాము కేవలం అభివృద్ధిలో మాత్రమే పోటీ పడుతున్నామని కేటీఆర్ తెలిపారు. తాము సొంత అన్నదమ్ముల్లా కలిసి పెరిగామన్నారు. ఉద్యమ కాలం నుంచి కేవలం తెలంగాణ కోసం పనిచేసిన తాము, ఇద్దరం కలిసి ఇలా ఒకే క్యాబినెట్లో పనిచేసే అవకాశం లభించిందని... ఇదంతా తెలంగాణ ప్రజలు తమకు ఇచ్చిన ఒక సువర్ణవకాశంగా భావిస్తున్నామన్నారు. 

తామంతా లక్షలాది తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు మాదిరి ముఖ్యమంత్రి గారు మరో పదిహేనేళ్లపాటు రాష్ట్రానికి నాయకత్వం వహించాలన్న కల కోసం పని చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. కెసిఆర్ కంటున్న బంగారు తెలంగాణ కల కోసం తామంతా సైనికుల్లా పని చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో భాగంగానే కాలంతో పోటీపడి కాళేశ్వరం ప్రాజెక్టును హరీష్ రావు పరిగెత్తిస్తున్నారన్నారు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ పరుగులెత్తుతూ ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు. ఆయన పనితీరు తమ నియోజకవర్గ అభివృద్ధిలో ఆదర్శంగా ఉంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ కార్యకర్తల సమావేశం భాగంగా మంత్రి కేటీఆర్ మండలాల వారీగా ముఖ్య నాయకులతో భేటీ అయి , రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇప్పటిదాకా తాము చేసిన పనులను ప్రజలకు తెలిసేలా వివరించాలని, ఓటింగ్ శాతాన్ని పెంచే ప్రయత్నం చేయాలని మంత్రి నియోజకవర్గ కార్యకర్తలకు సూచించారు.

వీడియో

సంబంధిత వార్తలు

సేఫ్ జోన్ లోకి కేటీఆర్: హరీష్ రావుపై కేసిఆర్ ప్లాన్ ఇదీ...

భావోద్వేగంతోనే రిట్మైర్మెంట్ కామెంట్ చేశా: మంత్రి హరీష్

హరీష్ టార్గెట్, కేటిఆర్ కు రస్తా: కేసిఆర్ ప్లాన్ ఇదీ...

కారులో హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి: సిద్ధిపేటపై కేసిఆర్ కన్ను

హరీష్ వేదాంత ధోరణి: గులాబీ గూడు చెదురుతోందా?

పొలిటికల్ రిటైర్‌మెంట్‌పై హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌కు ఓటేస్తే...: ఏపీకి ప్రత్యేక హోదాపై హారీష్ ట్విస్ట్

నిజమా?: హరీష్ రావుతో భేటీకి కేసిఆర్ నో

టీఆర్ఎస్ లో ఇంటి పోరు..హరీశ్ కు పొగబెడుతున్న కేసీఆర్: రఘునందన్ రావు

 

Follow Us:
Download App:
  • android
  • ios