Asianet News TeluguAsianet News Telugu

కేసిఆర్ ను ముట్టుకుంటే భస్మమైపోతారు

  • నన్ను జైలుకు పంపుతా అంటే భస్మమైపోతారు
  • కాంగ్రెస్ కు పది సీట్లు మించి రావు, బిజెపికి ఒక్కటి కూడా రాదు
  • మాకు రెండు సర్వేల్లో 100కు పైగా వస్తాయి
  • గడ్డాలు పెంచుకుంటే, సన్యాసం పుచ్చుకుంటే ఓట్లు రావు
KCR warns  those who touch him would get reduced to ashes

తెలంగాణ సిఎం కేసిఆర్ మరోసారి బిజెపి దుమ్ము దులిపారు. పనిలో పనిగా కాంగ్రెస్ ను కూడా మడత పెట్టారు. తన మీద బిజెపి నేతలు అడ్డగోలుగా మాట్లాడితే సహించబోనని హెచ్చరించారు. ఒల్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిక జారీ చేశారు. ప్రగతిభవన్ లో మీడియా సమావేశంలో కేసిఆర్ అనేక అంశాలపై కూలంకషంగా మాట్లాడారు. ఆయన మాటల్లోనే చదవండి.

ప్రధాని మోడీని నేను అనలేదు. నేను అననిదాన్ని అన్నట్లు చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నారు. నేను మోడీ గారికి అన్నాను తప్ప గానికి అనలేదు. వీడియోలు తెప్పించుకుని చూశాను. అయినా గోల చేస్తా అంటే వాళ్ల ఇష్టం. లేనిపోనివి మాట్లాడుతున్నారు. తీవ్రంగా మాట్లాడుతున్నారు. బిజెపి నేతలు ఒల్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ప్రధానినే విమర్శిస్తరా అని కొందరు మాట్లాడుతున్నారు. అవసరమైతే విమర్శిస్తారు. ప్రజాస్వామ్యంలో సహజం. కేసిఆర్ కు జైలుకు పోవాలని ఉందా? అని బిజెపి ఎమ్మెల్యే అంటున్నాడు. కేసిఆర్ ను జైలుకు పంపుతారా? కొన్ని సందర్భాల్లో కొంతమందిని ముట్టుకుంటే భస్మమైపోతారు. ఏం జైలుకు పోతారండి. తోక.. నాకున్నదేంది? నేను జైలుకు పోయేదేంది? ఈ ప్రధానమంత్రే నన్ను పొగిడిండు. మేం ఏం కుంభకోణం చేయలేదు. కరెంటు ప్రాజెక్టులు బిహెచ్ఇఎల్ కు ఇచ్చర్రని పొగిడారు.

దుర్మార్గమైన సంపాదన మాకు అక్కర లేదని అనుకున్నం. నా జేబుకు ఉండే పెన్నుతో సహా నేను ఐటి లెక్కలు సమర్పిస్తాం. ఎన్నికల్లో నిలబడ్డప్పుడు లెక్కలిస్తం. ఇంతకుముందు దొంగ పనులు చేసినోళ్లు, కుంభకోణాలు చేసినోళ్లు, తప్పు పనులు చేసినోళ్లు భయపడతారు. నన్ను ముట్టుకుని చూస్తే తెలుస్తది. ఎవలి కథ ఏందో అన్నది. అన్ని పార్టీలకు చందాలిస్తారు. ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఎట్లా నడుస్తాయో మా పర్టీ అట్లనే నడుస్తది.

నిర్మలా సీతారామన్ వచ్చి దృష్టి సారించిందని ఒక జోక్ ప్రచారం చేస్తున్నారు. రోజు దృష్టి సారిస్తారయా నాకర్థం కాదు. సారించుకోండి ఎవలొద్దన్నరు? రోజు కాకపోతే గంట గంటకు సారించుకోండ్రి. మేము సర్వే చేయించుకున్నామంటున్నాడు. మా సర్వే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం చేయిస్తమా? నేను రెండు సర్వేలు కలిపి ఆరున్నర లక్షల షాంపిల్స్ ఒకదాంట్లె 106, ఇంకోదాంట్లె 103 అని వచ్చాయి. సన్యాసం తీసుకుంటా అని అంటున్నాడు. నువ్వు గడ్డం పెంచుకుంటే.. సన్యాసం తీసుకుంటే రాజకీయం ఉంటాదయా నాకు అర్థం కాదు. పలానాయన గడ్డం పెంచుకుండంటే ఓట్లేస్తరా?

నేను వాడు, వీడు అన్న పదజాలం మాట్లాడిన కానీ మోడీ గారిని కాదు.. కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్, బిజెపి అధికారంలోకి వచ్చినా ఒరిగేదేం లేదని చెప్పిన. వాడు, వీడు అని ఎపి రాజకీయాల గురించి మాట్లాడిన. ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి అధికారంలో ఉంటే కాంగ్రెస్ వాడు, కాంగ్రెస్ అధికారంలో ఉంటే టిడిపి వాడు కందెన్లు, వరి కంకులు తీసుకొచ్చిండు అన్న తప్ప ఇంకోటి కాదు. తెలంగాణలో వాడే కామన్ భాషనే మాట్లాడుతున్న. వీడు రాడు, వాడు రాడు అన్నది కామన్ లంగ్వేజ్. సింపుల్ లాంగ్వేజ్ లో కచ్చితంగా గట్లనే మాట్లాడతా. సంస్కృతాలు మాట్లాడుడు నాతోటి కాదు.

బిజెపి పార్టీ ఉన్నాదండీ తెలంగాణలో. లక్ష్మణ్ మాట్లాడతాడు పెద్ద జోక్. వరంగల్ బై ఎలక్షన్స్ లో పాపం అమెరికా నుంచి డాక్టర్ ను తెచ్చుకున్నారు. ఏమైంది. వాళ్ల సక్కదనం. కాంగ్రెస్ వాళ్లకు ఉన్న ప్రస్టేషన్ ప్రజలకున్నట్లు భావించి మాట్లాడుతున్నారు. పేద్ద బస్సు యాత్ర అని కొండంత రాగం తీస్తే ఏడ ఐదారు వేలు దాటలేదు. రైతులకు ఇన్వెస్ట్ మెంట్ సపోర్ట్ ఇయ్యమని ఎవరన్నా అడిగిర్రా? తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి జరుగుతున్నది. ఇవన్నీ ప్రజలకు తెలిసిపోయినయ్. మా స్కీములన్నీ గోప్యంగా ఉండవు. ఓపెన్ గానే ఉంటాయి. భగీరథ నీళ్లు, కళ్యాణ లక్ష్మి వచ్చే, 24 గంటల కరెంటు వచ్చె. ఇవన్నీ దాచిపెడితే దాగుతయా?

75లక్షల మందికి పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇయ్యబోతున్ననం. ఎవరిచ్చిర్రు అండీ. ఇవన్నీ రైతులకు ప్రత్యక్షంగా అనుభవంలో ఉంది. నేను గ్యారెంటీగా చెప్పగలుగుతున్న. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా 10 సీట్లు దాటవు. అది కూడా మేము పట్టించుకోకపోతే.. పట్టించుకుంటే కథ వేరే ఉంటది. బిజెపికి ఒక్కటి కూడా రావు. నేను 70 నిమిషాలు మాట్లాడిన. మిగిలిన 68 నిమిషాల ముచ్చటేంది? దానికి సమాధానం చెప్పరేంది? అయినా అనని మాటను పట్టుకుని గాయి గాయి చేస్తున్నరు. నేను ఎవరిని దూషించలేదు. దూషించాలని నా ఉద్దేశం కాదు.

కాంగ్రెస్, బిజెపి దొందు దొందే. దేశంలో గుణాత్మకమైన మార్పు వస్తలేదు. సీరియస్ గా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దేశ రాజకీయాల్లో ప్రభలమైన మార్పులు రావాలి. ఆ స్టాండ్ మీద స్టిక్ అయి ఉన్నం. మేము అదే బాటలో సాగుతాం. పిచ్చి ప్రయత్నాలు మానుకుంటే మంచిది.

 

Follow Us:
Download App:
  • android
  • ios