జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్: విచారణ అధికారిగా ఏసీపీ సుదర్శన్ నియామకం

నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన విచారణ అధికారిగా ఏసీపీ సుదర్శన్ ను నియమించారరు. ఈ కేసులో ఒక నిందితుడు పరారీలో ఉన్నాడు.  అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Jubilee Hills Gang Rape Case:ACP Sudarshan Appoints As investigating officer

హైదరాబాద్:  Hyderabad నగరంలోని Jubilee Hills  పోలీస్ స్టేషన్ పరిధిలో Minor Girl పై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన విచారణ అధికారిగా ACP Sudarshan సుదర్శన్ ను నియమించారు.ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.  ఈ కేసులో ఐదుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లు కాగా, ఇద్దరు మేజర్లు. ఓ నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ప్రజా ప్రతినిధుల పిల్లలు కావడం గమనార్హం. ప్రజా ప్రతినిధుల పిల్లలున్నందున కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేశారని విపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. అయితే ఈ ఆరోపణలను తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ ఖండించారు. నిందితులు మైనర్లైనందున ఆలస్యమైందని Home Minister వివరించారు.

BJP  ఎమ్మెల్యే Raghunandhanrao  మీడియా సమావేశంలో విడుదల చేసిన ఫోటోలు, వీడియోలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ విషయమై కూడా పోలీసులు లీగల్ ఓపినియన్ ను తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. 

ఈ ఏడాది మే 28వ తేదీన Amnesia Pub  లో  గెట్ టూ గెదర్ పార్టీకి మైనర్ బాలిక హాజరైంది. ఈ పార్టీ ముగిసిన తర్వాత  బాలికను ఇంటి వద్ద దింపుతామని చెప్పి కారులో తీసుకెళ్లిన నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. 

అయితే బాలిక తండ్రి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకొంటుంది. అయితే  ఆసుపత్రిలో ఉన్న బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్  తీసుకున్నారు.తనపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు బాలిక వివరించింది. మరో సారి బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్ ను తీసుకొనే అవకాశం ఉంది.

also read:.జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనలో నలుగురు అరెస్ట్: వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్

బాలికపై అత్యాచారం చేసిన తర్వాత నిందితుల మొయినాబాద్ కి సమీపంలోని ఫామ్ హౌస్ లో ఉన్నారని పోలీసులు గుర్తించారు.ఈ ఫామ్ హౌస్ నుండి ఇన్నోవా కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. అయితే ఈ కారులో నిందితులు ఆధారాలు దొరకకుండా చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. మరో వైపు రెడ్ కలర్ బెంజ్ కారులో కూడా ఫోరెన్సిక్ నిపుణులు క్లూస్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆదివారం నాడు సాయంత్రం ఈ కారులో నిపుణులు ఆధారాల కోసం అన్వేషణ ప్రారంభించారు.

అమ్నేషియా పబ్ లో విద్యార్ధుల గెట్ టూ గెదర్ పార్టీకి ఓ కార్పోరేట్ స్కూల్ యాజమాన్యం అనుమతి తీసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో మద్యం అనుమతించలేదని పబ్ మేనేజర్ సాయి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.  ఈ పార్టీకి మేజర్లు, మైనర్లు కలిసి హాజరయ్యారని చెప్పారు. పరీక్షల చివరి రోజున ఈ గెట్ టూ గెదర్ పార్టీని నిర్వహించారని ఆయన చెప్పారు.గెట్ టూ గెదర్ పార్టీ ముగిసి విద్యార్ధులంతా పబ్ నుండి వెళ్లిపోయిన తర్వాత పబ్ లో లిక్కర్ ఓపెన్ చేశామని సాయి మీడియాకు తెలిపారు. గెట్ టూగెదర్ పార్టీకి పబ్ ను ఎందుకు బుక్ చేశారనే విషయమై కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios