.జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనలో నలుగురు అరెస్ట్: వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన కీలక దశలో ఉందని హైద్రాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా చెప్పారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన చెప్పారు.
హైదరాబాద్:Jubilee Hills gang rape ఘటన కేసు విచారణ కీలక దశలో ఉందని హైద్రాబాద్ వెస్ట్ జోన్ డీసీసీ Joel davis చెప్పారు.ఆదివారం నాడు హైద్రాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ మీడియాతో మాట్లాడారు.ఐదుగురు నిందితుల్లో నలుగురిని అరెస్ట్ చేశామన్నారు.
ఇవాళ ఒక మైనర్ ను అరెస్ట్ చేసినట్టుగా ఆయన చెప్పారు. నిన్న ఒక మేజర్ తో పాటు మైనర్ ను అరెస్ట్ చేశామని డీసీపీ తెలిపారు. ఈ కేసు ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన వివరించారు.
ఈ ఏడాది మే 28వ తేదీన అమ్నేషియా పబ్ నుండి బాధితురాలిని తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు. కారులోనే బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై విపక్షాలు అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
ఈ ఘటన జరిగిన తర్వాత గోప్యంగా ఉంచడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. ప్రజా ప్రతినిధుల పిల్లలు ఉన్నందున ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారా అని విపక్షాలు ప్రశ్నించాయి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ను విపక్షాలు ముట్టడించాయి. ఈ కేసులో ఓ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు మాత్రం పరారీలో ఉన్నాడు. ముగ్గురు మైనర్లను జువైనల్ హోంకి తరలించారు. నిందితులు ఉపయోగించిన ఇన్నోవా కారును శనివారం నాడు రాత్రే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
also read:శంషాబాద్‌లో అర్ధరాత్రి పబ్‌లను ముట్టడించిన ఎన్‌ఎస్‌యూఐ.. తీవ్ర ఉద్రిక్తత..
ఈ కేసు విషయమై విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు.ఈ ఘటనలో పాల్గొన్నవారంతా మైనర్లు కావడంతోనే చర్యలకు ఆలస్యం అవుతుందని చెప్పారు. నిందితులు మైనర్లు కావడంతో పోలీసులు వారి పరిధిలో విచారణ జరుపుతున్నారని వెల్లడించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కూడా బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ విషయమై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.
అమ్నేషియా పబ్ లో గెటూ టూ గెదర్ పార్టీ జరిగిన తర్వాత ఇంటి వద్ద దింపుతామని మైనర్ బాలికను కారులో తీసుకెళ్లారు నిందితులు. గంటన్నర తర్వాత బాలికను కారులో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. గంటన్నర తర్వాత బాధితురాలిని పబ్ వద్ద వదిలివెళ్లారు. ఈ విషయమై బాధితురాలు తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.. దీంతో బాధితురాలి తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చింది.
అమ్నేషియా పబ్ లో విద్యార్ధుల గెట్ టూ గెదర్ పార్టీకి ఓ కార్పోరేట్ స్కూల్ యాజమాన్యం అనుమతి తీసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో మద్యం అనుమతించలేదని పబ్ మేనేజర్ సాయి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఈ పార్టీకి మేజర్లు, మైనర్లు కలిసి హాజరయ్యారని చెప్పారు. పరీక్షల చివరి రోజున ఈ గెట్ టూ గెదర్ పార్టీని నిర్వహించారని ఆయన చెప్పారు.గెట్ టూ గెదర్ పార్టీ ముగిసి విద్యార్ధులంతా పబ్ నుండి వెళ్లిపోయిన తర్వాత పబ్ లో లిక్కర్ ఓపెన్ చేశామని సాయి మీడియాకు తెలిపారు.