హైదరాబాద్: అంతర్జాతీయ మహిళల అక్రమ రవాణ కేసులో ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బంగ్లాదేశ్ నుండి హైద్రాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలకు యువతులకు అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించింది.

ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో తొమ్మిది మంది బంగ్లాదేశీయులుగా పోలీసులు గుర్తించారు. మిగిలినవారు స్థానికులు.
తప్పుడు గుర్తింపు కార్డులను సృష్టించి బంగ్లాదేశ్ నుండి యువతులను తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారం చేయించిన  విషయాన్ని గుర్తించారు.దీంతో నిందితులపై ఎన్ఐఏ చార్జీషీట్ దాఖలు చేసింది. ఉద్యోగాల పేరుతో హైద్రాబాద్ కు తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నారని ఎన్ఐఏ  అభిప్రాయపడింది.

సోన్ నదిని దాటించి కలకత్తా మీదుగా ముంబై, హైద్రాబాద్ తరలించినట్టుగా పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు.పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళల అక్రమ రవాణ కేసు నమోదైంది.బంగ్లాదేశ్ నుండి తీసుకొచ్చిన యువతులను షెల్టర్ హోమ్స్ లో ఉంచారు. 

ఈ కేసులో రుహుల్ అమిన్ ధాలి, అబ్దుల్ బారిక్ షేక్ బంగ్లాదేశ్ ల నుండి భారత్ కు మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం చేయించారని దర్యాప్తులో తేలడంతో వారిని అరెస్ట్ చేశారు.

ఉమెన్ ట్రాఫికింగ్ కేసులో ధాలి ఇంతకుముందే ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ధాలి, షేక్ మధ్య ఈ విషయమై డబ్బు బదిలీ జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు.1980లో భారత్ లోకి ప్రవేశించారు. యూసుఫ్ ఖాన్, అతని భార్య బీతి బేగంతో కలిసి దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యభిచారం రాకెట్ నిర్వహిస్తున్నారు.

ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన అసద్ హసన్, షరీఫుల్ షేక్, హహ్మద్ అల్ మామున్, సోజిబ్ షేక్, సురేష్ కుమార్ దాస్, మహ్మద్ అబ్దుల్లా మున్షి, బంగ్లాదేశ్ కు చెందిన మహ్మద్ అయూబ్ షేక్ లపై చార్జీషీట్ దాఖలు చేసింది ఎన్ఐఏ.