Asianet News TeluguAsianet News Telugu

చెర్రీస్ ఉన్నాయి.. కావాలా?.. పండులాంటి భామలతో ఫైవ్ స్టార్ హోటళ్లలో హైటెక్ వ్యభిచారం..

వాట్సాప్ వేదికగా నగరంలోని ఖరీధైన హోటళ్లో విదేశీ యువతులతో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇటీవల గచ్చిబౌలిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ మీద ఆకస్మిక దాడి చేసి ముగ్గురు విదేశీ యువతులు, ఒడిశాకు చెందిన మణికేష్ యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వెల్లడైన అంశాలు పోలీసులనే విస్తుగొలిపాయి. 

high tech prostitution in hyderabad
Author
Hyderabad, First Published Sep 9, 2021, 9:57 AM IST

ఆపిల్...చెర్రీ..జామ..నారింజ.. ఇవి పండ్ల పేర్లు కాదు. ప్రత్యేక కోడ్ భాష.  ఆస్ట్రేలియా అమ్మాయిలైతే చెర్రీస్ ఉన్నాయి.. కావాలా? అంటూ మెసేజ్ పెడతున్నారు. మన దేశానికి చెందిన వాళ్లయితే యాపిల్స్ ఉన్నాయి.. ఎవరైనా తింటారా? అని అడుగుతున్నారు. ఒక్కో దేశానికి చెందిన అమ్మాయిలకు ఒక్కో కోడ్ ఉంటుంది. 

ఇలా పోలీసులకు చిక్కకుండా.. వాట్సాప్ వేదికగా నగరంలోని ఖరీధైన హోటళ్లో విదేశీ యువతులతో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇటీవల గచ్చిబౌలిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ మీద ఆకస్మిక దాడి చేసి ముగ్గురు విదేశీ యువతులు, ఒడిశాకు చెందిన మణికేష్ యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వెల్లడైన అంశాలు పోలీసులనే విస్తుగొలిపాయి. 

కజకిస్థాన్, థాయ్ లాండ్, ఉజ్బెకిస్థాన్ నుంచి యువతులను భారత్ కు విజిట్ వీసాపై రప్పించి, గడువు ముగిసే వరకు కోల్ కతా, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ నగరాలకు తిప్పుతున్నారు. తర్వాత కర్ణాటకలోని హుబ్లీ కేంద్రంగా ఆధార్ కార్డు, ఓటర్ కార్డు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీసా గడువు ముగిసినా వీటితోనే తిష్టవేస్తున్నారు. మణికేష్ ఫోన్ లో వ్యభిచారానికి సంబంధించిన లావాదేవీలు వెలుగు చూశాయి.

నగరానికి చెందిన పలువురు ప్రముఖుల ఫోన్ నంబర్లు, వాట్పాప్ సంభాషణలు చూసి పోలీసులు కంగుతిన్నారు. ఈ భారీ వ్యవస్థను చేధించేందుకు త్వరలోనే నిందితుణ్ణి కస్టడీలోకి తీసుకోనున్నారు. 

ఆయా నగరాల్లోని పంచతార హోటళ్లలో ఒకట్రెండు రోజులు మాత్రమే ఉంటారు. అమ్మయాయిలను ఎప్పుడు తీసుకు వచ్చేది ప్రధాన నిర్వాహకుడికి మాత్రమే తెలుస్తుంది. విటుల్లో సంపన్నులు, వారి పిల్లలు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, కంపెనీల్లో ఉన్నత హోదాల్లో ఉన్నవారే అధికులు. విదేశీ యువతులకున్న డిమాండ్ దృష్ట్యా భారీగా వసూలు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios