Asianet News TeluguAsianet News Telugu

రామానాయుడు కుటుంబానికి భారీ ఊరట.. ఆ భూముల వారివేనని హైకోర్టు తీర్పు.. ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ..

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలో సుమారు రూ.2000 కోట్ల విలువైన 26 ఎకరాల భూమిపై దావా వేసిన తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ భూముల వివాదాంలో రామనాయుడు కుటుంబంతో పాటు, పలువురు టాలీవుడ్ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు ఊరట కలిగింది. 

HC dismisses Telangana claim on Khanamet lands Big relief to  D Rama Naidu Family
Author
First Published Aug 18, 2022, 10:14 AM IST

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామంలో సుమారు రూ.2000 కోట్ల విలువైన 26 ఎకరాల భూమిపై దావా వేసిన తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఖానామెట్‌లోని సదురు భూమిపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్ నందాతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. దీంతో ఆ భూముల వివాదాంలో రామనాయుడు కుటుంబంతో పాటు, పలువురు టాలీవుడ్ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు ఊరట కలిగింది. 

ఖానామెట్‌లో 1996లో దగ్గుబాటి రామానాయుడు కుటుంబం కొనుగోలు చేసిన భూములతో పాటు, దర్శకుడు కె రాఘవేంద్రరావు, పి గోవింద రెడ్డి, రవి మల్హోత్రా, కోఠారి ఎక్స్‌పోర్ట్‌ తదితరులకు చెందిన 26 ఎకరాలు 16 గుంటల భూమికి సంబంధించిన హక్కుల వివాదంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేసింది. మరోవైపు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు రాష్ట్ర వాదనకు వ్యతిరేకంగా ఆయన వాదించారు. 1996 మే 23 నుంచి 1996 జూన్ 4 మధ్య కాలంలో కె.కౌసల్య తదితరుల నుంచి వివిధ సేల్ డీడ్‌ల ద్వారా భూమిని పిటిషనర్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే ఇందుకు సంబంధించి సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. 

ఈ భూమి హక్కులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదన ఆమోదయోగ్యం కాదని కోర్టు ప్రకటించింది. గతంలో 2009, 2010లలో ఇద్దరు సింగిల్ జడ్జిలు పిటిషనర్లను భూమి నుంచి వెళ్లగొట్టకుండా అప్పటి ప్రభుత్వంపై నిషేధం విధించగా.. తెలంగాణ హైకోర్టు ఆ తీర్పును సమర్థించింది.

‘‘రామానాయుడు తదితరుల రికార్డును తారుమారు చేశారని, మోసపూరిత పత్రాలు సృష్టించారని ప్రబుత్వం ఆరోపణలు చేయలేదు. రికార్డుల్లో కూడా ఇలాంటి ఆరోపణలు లేవు. 1961లో అసైన్‌మెంట్ తప్పని చెబుతున్నారు. 1963లో మాజీ సైనికుకు బూమి కేటాయింపు జోవో వచ్చినప్పుడు.. గతంలో చేసిన అసైన్‌మెంట్ రద్దుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భూమిని కేటాయించిన 5 దశాబ్దాల తర్వాత.. అనుబంధ స్వేతార్ జారీ చేసిన 15 ఏళ్ల తర్వాత చర్యలు ప్రారంభించడం సరికాదు. అనుబంధ సేత్వార్‌ను రద్దు చేయడం  చెల్లదు’’ అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. 

ఖానామెట్‌లోని సర్వే నెం. 4, 5,8, 9, 10,14/9-12లోని 26 ఎకరాల 16 గుంటల భూములకు సంబంధించి 1993 అనుబంధ సేత్వార్‌ను రద్దు చేస్తూ కమిషనర్ (అప్పీళ్లు) నిర్ణయాన్ని పక్కన బెడుతూ సింగిల్ బెంచ్‌ తీసుకన్న నిర్ణయాన్ని హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. ప్రభుత్వ అప్పీళ్లను ధర్మాసనం కొట్టేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios