Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌కు షాక్: బెల్లంపల్లి నుండి బరిలోకి వినోద్, తెర వెనుక కథ ఇదీ

టీఆర్ఎస్ టికెట్టు  దక్కకపోవడంతో  ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నుండి  బీఎస్పీ అభ్యర్థిగా మాజీ మంత్రి వినోద్  బరిలోకి దిగారు

former minister vinod contesting from bellampally assembly segment
Author
Adilabad, First Published Nov 20, 2018, 12:05 PM IST


ఆదిలాబాద్: టీఆర్ఎస్ టికెట్టు  దక్కకపోవడంతో  ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నుండి  బీఎస్పీ అభ్యర్థిగా మాజీ మంత్రి వినోద్  బరిలోకి దిగారు.చెన్నూరు టీఆర్ఎస్ టికెట్టు రాకపోవడంతో  బెల్లంపల్లి నుండి ఆయన బరిలోకి దిగారు. కేసీఆర్, కేటీఆర్  బుజ్జగించినా కూడ ఆయన సంతృప్తి చెందలేదు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని  చెన్నూరు అసెంబ్లీ స్థానం నుండి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ బరిలోకి దిగాడు. ఈ స్థానం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు టీఆర్ఎస్ టికెట్టు ఇవ్వలేదు. టీఆర్ఎస్  ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే  మంచి అవకాశం కల్పిస్తామని  ఓదేలుకు కేసీఆర్ హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే చెన్నూరు స్థానం నుండి పోటీ చేసేందుకు మాజీ మంత్రి వినోద్  రంగం సిద్దం చేసుకొన్నారు.కానీ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో  పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుండి  వివేక్‌ను పోటీ చేసేందుకు వీలుగా  బాల్క సుమన్ ను చెన్నూరు నుండి  కేసీఆర్ బరిలోకి దింపారు.

చెన్నూరు ఎమ్మెల్యే టికెట్టును కూడ వినోద్ ఆశించారు. కానీ,  చెన్నూరు నుండి  వినోద్‌కు టికెట్టు ఇచ్చే పరిస్థితి కేసీఆర్ లేకుండాపోయింది. సుమన్ ను పోటీ నుండి తప్పించేలా చివరివరకు వినోద్, వివేక్‌లు తీవ్రంగా ప్రయత్నించారు. ఒకానొక దశలో  వినోద్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది. వినోద్ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నేతలను కలిసేందుకు కూడ వెళ్లారని  ప్రచారం  కూడ సాగింది.

ఈ సమయంలోనే  కేసీఆర్  మాజీ మంత్రి వినోద్‌తో ఫోన్‌లో చర్చలు జరిపారని.. భవిష్యత్తులో ఎమ్మెల్సీ  పదవి లేదా మంచి నామినేటేడ్ పదవిని  ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో  కొంత వినోద్ మెత్తబడినట్టు  కన్పించారు.  దీంతో వివేక్  చెన్నూరు నియోజకవర్గంలో  సుమన్  ప్రచారంలో పాల్గొన్నారు.

మరో వైపు తాను కోరుకొన్నా టికెట్టును కేసీఆర్  కేటాయించకపోవడంతో  అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ మంత్రి వినోద్ టీఆర్ఎస్‌కు  షాక్ ఇచ్చారు. చెన్నూరు  నుండి కాకుండా బెల్లంపల్లి అసెంబ్లీ స్థానం నుండి  బీఎస్పీ అభ్యర్థిగా వినోద్ బరిలోకి దిగారు.

చెన్నూరులో టీఆర్ఎస్‌ క్యాడర్ అంతా బాల్క సుమన్ వైపు వెళ్లింది. దీంతో  బెల్లంపల్లి  స్థానాన్ని  వినోద్ ఎంచుకొన్నారు. బెల్లంపల్లి  నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలో దిగుతున్న దుర్గం చిన్నయ్య తీరుపై  స్థానిక టీఆర్ఎస్‌ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది.

బెల్లంపల్లి నుండి  వినోద్ బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంలో స్థానికంగా  ఉన్న కొందరు టీఆర్ఎస్ నేతలు చక్రం తిప్పారని  సమాచారం. ప్రజా కూటమి (మహా కూటమి)లోని పార్టీల మధ్య పొత్తులో భాగంగా  బెల్లంపల్లి సీటు సీపీఐకు కాంగ్రెస్ పార్టీ కేటాయించింది.

ఈ స్థానం నుండి సీపీఐ అభ్యర్థిగా  మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ బరిలో నిలిచారు.  బెల్లంపల్లి స్థానాన్ని  కాంగ్రెస్ పార్టీ వదులుకోవడంపై  ఆ పార్టీ క్యాడర్‌ కూడ అసంతృప్తితో ఉంది. సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్‌కు సహకరించేందుకు  కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌ ఇష్టంగా లేదని సమాచారం.

పరోక్షంగా బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి వినోద్‌కు కూడ కాంగ్రెస్ పార్టీ  క్యాడర్ సహకరించే అవకాశాలు లేకపోలేదని సమాచారం. బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో వినోద్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తే  ఆయన విజయం నల్లేరుపై నడకేనని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

వినోద్ బీఎస్పీ అభ్యర్థిగా బెల్లంపల్లి నుండి బరిలోకి దిగడంతో వినోద్, వివేక్ మధ్య కొంత మనస్పర్థలు వచ్చినట్టు ప్రచారం సాగుతోంది. చెన్నూరు నుండి పోటీ చేస్తున్న బాల్క సుమన్  గెలిపించాల్సిన బాధ్యత వివేక్‌పై ఉంది.  సుమన్ ఈ స్థానం నుండి గెలిస్తేనే 2019లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి సీటును వివేక్‌కు  కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం లేకపోలేదు.


సంబంధిత వార్తలు

రంగంలోకి కేసీఆర్: వినోద్‌కు బంపరాఫర్

కాంగ్రెస్‌లోకి వెళ్లొద్దు...ఎమ్మెల్సీ ఇస్తాం...వినోద్‌కు కేటీఆర్ ఆఫర్..?

కేసీఆర్ కి షాక్.. కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ కీలకనేత

కల్వకుర్తిలో టీఆర్ఎస్ జోరు..అలకవీడిన ఎమ్మెల్సీ కసిరెడ్డి

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ఇకపై తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్... ఢిల్లీ అక్బర్‌ రోడ్: ఎంపీ వినోద్

ఇది నందమూరి టీడీపీ కాదు.. నారా టీడీపీ..బాబును ప్రశ్నించండి: కిషన్‌రెడ్డి

నమ్మకం లేదా.. సీట్లు దక్కలేదా.. ఈ ముగ్గురు పోటీలో ఎందుకు లేరు..?

వదిలిపెట్టను: కేసీఆర్ పై బొడిగె శోభ తిరుగుబాటు

ఎన్నికల 'సిత్రాలు': షేవ్ చేస్తూ, తినిపిస్తూ, స్నానం చేయిస్తూ....

అరే పొత్తుపైనే క్లారిటీ లేదు, ఇక సీట్లెక్కడ, దూతలెక్కడ:కోదండరాం

 

Follow Us:
Download App:
  • android
  • ios