తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కి.. మరో నేత షాక్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు. టీఆర్‌ఎస్ నేత వినోద్‌ కాంగ్రెస్‌లో చేరే అవకాశం కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు అన్ని ప్రయత్నాలు చేసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. 

ప్రస్తుతం వినోద్ ఢిల్లీలోనే ఉన్నారు. అయితే వినోద్‌ను బుజ్జగించేందుకు టీఆర్‌ఎస్ అధిష్టానం అన్ని ప్రయత్నాలు చేసింది. సోదరుడు వివేక్‌తోనూ రాయబారం నడిపించింది. అయితే వినోద్ మాత్రం టీఆర్‌ఎస్‌ను వీడాలనే నిర్ణయించుకున్నట్లు సమాచారం.

 చెన్నూర్‌ టికెట్ ఇస్తారనే టీఆర్‌ఎస్‌లో చేరానని కానీ, మొండిచేయి చూపారని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. వినోద్ కాంగ్రెస్‌లో చేరితే చెన్నూర్ నుంచే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్ చెన్నూర్‌ అభ్యర్ధి బాల్క సుమన్‌ను ఓడించే సత్తా వినోద్‌కు ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.