ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీఆర్ఎస్‌లో అసమ్మతి రాగాలు తీసే నేతలు ఎక్కువవుతున్నారు. చెన్నూరు నుంచి టికెట్ ఆశించి భంగపడి తీవ్ర మనస్తాపానికి గురైన మాజీ మంత్రి, సీనియర్ నేత జి. వినోద్‌ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు.

రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన వినోద్ కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. చెన్నూర్ నుంచి రాకపోతే బెల్లంపల్లైనా తనకు ఓకేనని ఆయన సంకేతాలు ఇచ్చారు. అయితే సోదరుడు వివేక్‌తో కలిసి వస్తేనే పార్టీలో చేర్చుకుంటామని కాంగ్రెస్ అధిష్టానం చెప్పడంతో... ఆయన డైలమాలో పడ్డారు.. అయినప్పటికీ తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.

అయితే ఆయన్ను బుజ్జించేందుకు మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. ప్రస్తుతానికి పట్టువీడాలని.. పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆయన వినోద్ ముందు ప్రతిపాదన ఉంచినట్లుగా టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాకా కేటీఆర్‌‌తో ఆయన చర్చలు జరిపే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. 
 

కేసీఆర్ కి షాక్.. కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ కీలకనేత

కల్వకుర్తిలో టీఆర్ఎస్ జోరు..అలకవీడిన ఎమ్మెల్సీ కసిరెడ్డి

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ఇకపై తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్... ఢిల్లీ అక్బర్‌ రోడ్: ఎంపీ వినోద్

ఇది నందమూరి టీడీపీ కాదు.. నారా టీడీపీ..బాబును ప్రశ్నించండి: కిషన్‌రెడ్డి

నమ్మకం లేదా.. సీట్లు దక్కలేదా.. ఈ ముగ్గురు పోటీలో ఎందుకు లేరు..?

వదిలిపెట్టను: కేసీఆర్ పై బొడిగె శోభ తిరుగుబాటు

ఎన్నికల 'సిత్రాలు': షేవ్ చేస్తూ, తినిపిస్తూ, స్నానం చేయిస్తూ....

అరే పొత్తుపైనే క్లారిటీ లేదు, ఇక సీట్లెక్కడ, దూతలెక్కడ:కోదండరాం