హైదరాబాద్: టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మాజీ మంత్రి వినోద్‌కు ఫోన్ చేశారు. భవిష్యత్తులో మంచి పదవులు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో వినోద్ చల్లబడ్డారు. చెన్నూరు అసెంబ్లీ టికెట్టు దక్కని వినోద్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం సాగింది. ఈ ఊహగానాల నేపథ్యంలో కేసీఆర్ ఫోన్ చేయడంతో వినోద్ మెత్తబడ్డారు. దరిమిలా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వినోద్,వివేక్ లు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్  టికెట్టును మాజీ మంత్రి వినోద్ ఆశించారు.కానీ, ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి  పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ను టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ బరిలోకి దింపారు. ఈ నియోజకవర్గం నుండి తాజా మాజీ ఎమ్మెల్యే ఓదేలుకు కూడ టికెట్టు నిరాకరించారు.ఓదేలుకు కూడ నామినేటేడ్ పదవిని ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

2019 లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా వివేక్ ను బరిలోకి దింపేందుకు గాను కేసీఆర్ బాల్క సుమన్ ను అసెంబ్లీ బరిలోకి దింపారు. అయితే చెన్నూరు టికెట్ వినోద్ కు కేటాయించకపోవడంతో వివేక్ సోదరులు అసంతృప్తికి గురయ్యారు.

ఈ విషయమై చెన్నూరు సీటు విషయమై మంత్రి కేటీఆర్ తో కూడ వివేక్ సోదరులు చర్చించారు.కానీ, ప్రకటించిన అభ్యర్థులను మార్చే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఇటీవలనే వినోద్ ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో వినోద్ చేరేందుకు ఢిల్లీకి వెళ్లారని ప్రచారం సాగింది.ఈ సమయంలో కేటీఆర్ వినోద్ కు ఫోన్ చేశారు. కార్పోరేషన్ లేదా ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని కేటీఆర్ వినోద్ కు ఫోన్ చేసి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరకూడదంటూ వినోద్‌ను కోరారు.

ఈ పరిణామాల నేపథ్యంలో వినోద్ ను కాంగ్రెస్ పార్టీలో చేరకుండా కేసీఆర్ రంగంలోకి దిగారు.  మాజీ మంత్రి వినోద్ కు ఫోన్ చేసి మాట్లాడారు. భవిష్యత్తులో మంచి పదవిని ఇస్తామని కేసీఆర్ వినోద్ కు హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ లేదా కార్పోరేషన్ ఛైర్మెన్ పదవిని ఇస్తామని వినోద్ కు కేసీఆర్ ఫోన్ చేసి హామీ ఇచ్చినట్టు చెప్పారు.

కేసీఆర్ ఫోన్ తో వినోద్ ఢిల్లీ నుండి హైద్రాబాద్ కు వచ్చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో  టీఆర్ఎస్ అభ్యర్థుల వెంట మాజీ ఎంపీ వివేక్ ప్రచారం నిర్వహిస్తున్నారు.  తన అనుచరులతో సమావేశాలు నిర్వహించి టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేయాలని వివేక్  తేల్చిచెప్పినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌లోకి వెళ్లొద్దు...ఎమ్మెల్సీ ఇస్తాం...వినోద్‌కు కేటీఆర్ ఆఫర్..?

కేసీఆర్ కి షాక్.. కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ కీలకనేత

కల్వకుర్తిలో టీఆర్ఎస్ జోరు..అలకవీడిన ఎమ్మెల్సీ కసిరెడ్డి

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ఇకపై తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్... ఢిల్లీ అక్బర్‌ రోడ్: ఎంపీ వినోద్

ఇది నందమూరి టీడీపీ కాదు.. నారా టీడీపీ..బాబును ప్రశ్నించండి: కిషన్‌రెడ్డి

నమ్మకం లేదా.. సీట్లు దక్కలేదా.. ఈ ముగ్గురు పోటీలో ఎందుకు లేరు..?

వదిలిపెట్టను: కేసీఆర్ పై బొడిగె శోభ తిరుగుబాటు

ఎన్నికల 'సిత్రాలు': షేవ్ చేస్తూ, తినిపిస్తూ, స్నానం చేయిస్తూ....

అరే పొత్తుపైనే క్లారిటీ లేదు, ఇక సీట్లెక్కడ, దూతలెక్కడ:కోదండరాం