కరీంనగర్: తాను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని వదిలేదని ఇటీవల చెప్పిన తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు తిరుగుబాటు సంకేతాలను పంపుతున్నారు. 

దళిత బిడ్డననే తనపై కేసీఆర్ వివక్ష చూపిస్తున్నారని ఆమె తాజాగా విమర్శించారు. 119 స్థానాల్లో 107 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించారని, సీటును పెండింగులో పెట్టారని ఆమె అన్నారు. గత 18 ఏళ్లుగా తాను టీఆర్ఎస్ లో పనిచేస్తున్నానని ఆమె గుర్తు చేశారు. 

ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన నుంచి ప్రయోజనం పొందినవారే ఇప్పుడు తనను దూషిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఫిర్యాదు చేసినవారికి టికెట్ ఇస్తే తాను వదిలిపెట్టేది లేదని, తాను బరిలోకి దిగుతానని ఆమె హెచ్చరించారు. 

సంబంధిత వార్త

పార్టీ మార్పుపై తేల్చేసిన బొడిగె శోభ