టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీఆర్ఎస్ ఎంపీ వినోద్. టీఆర్ఎస్‌ను ఓడించేందుకే టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని ఆయన ఆరోపించారు.

కేవలం నాలుగు సీట్ల కోసం..తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు.. సోనియాకు తాకట్టు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలన్న ఎన్టీఆర్ ఆశయాలకు వ్యతిరేకంగా.. చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని వినోద్ అన్నారు.

తెలుగుదేశం పార్టీ నిన్న , మొన్నటి వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌, నాచారం, గండిపేటలలో విధాన నిర్ణయాలు తీసుకునేదని.. కానీ ఇక నుంచి టీడీపీ హెడ్ ఆఫీస్ ఢిల్లీ అక్బర్ రోడ్ నుంచి పనిచేస్తుందని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు కలుపుతానంటున్న ప్రాంతీయ పార్టీలు ఏవీ కూడా కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేవన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం ప్రజలు ఏ మాత్రం హర్షించడం లేదని.. దీని పర్యవసానాన్ని రాబోయే ఎన్నికల్లో చూస్తారని వినోద్ స్పష్టం చేశారు.

బీజేపీయేతర ఫ్రంట్‌‌ వైపు బాబు అడుగులు: 20 ఏళ్ల తర్వాత

నా మనసు క్షోభిస్తోంది.. చంద్రబాబు ఆవేదన

రాహుల్‌తో నేడు భేటీ: యూపీఏలోకి చంద్రబాబు

జాతీయ స్థాయిలో పోటీకి చంద్రబాబు ప్లాన్

అఖిలేష్, మమతా ఫోన్: చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ దూకుడు

చంద్రబాబుకు అఖిలేష్ యాదవ్ ఫోన్:ఎల్లుండి ఢిల్లీకి పయనం

ప్రజా కూటమి: ఢిల్లీలో బాబుతో ఉత్తమ్ భేటీ

హస్తినలో చంద్రబాబు బిజీబిజీ: జాతీయ మద్దతుకు ప్రయత్నం