Asianet News TeluguAsianet News Telugu

దిశ కేసు: సోదరితో చివరిగా మాట్లాడింది ఆమెనే, కీలక ఆధారాలు

గ్యాంగ్ రేప్ కు ముందు దిశ తన సోదరితో మాట్లాడిందని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించింది. 

Forensic lab confirms that disha spoke with her sister before death
Author
Hyderabad, First Published Jan 28, 2020, 7:49 AM IST

హైదరాబాద్: దిశ గ్యాంగ్ రేప్ కు ముందు తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకొన్న ఘటనలపై పోలీసులు శాస్త్రీయమైన ఆధారాలను సేకరించారు.ఈ ఆధారాలను ఫోరెన్సిక్ నివేదిక కూడ ధృవీకరించినట్టుగా తెలుస్తోంది.

Also read:దిశ నిందితులకు మరో 9 కేసులతో లింకులు: ఆధారాలు సేకరించిన పోలీసులు

2019 నవంబర్ 27వ  తేదీ రాత్రి దిశను నలుగురు నిందితులు తొండుపల్లి సర్వీస్ రోడ్డుకు సమీపంలో గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను షాద్‌నగర్ కు సమీపంలోని చటాన్‌పల్లి అండర్ పాస్ వద్ద పెట్రోల్ పోసి దగ్దం చేశారు.

ఈ గ్యాంగ్ రేప్ కు పాల్పడిన నలుగురు మహ్మద్ ఆరీఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్ లు చటాన్ పల్లి వద్దే గత ఏడాది డిసెంబర్ 6వ తేదీన జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందారు.

ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే సాక్ష్యాలను సేకరించి కోర్టుకు సమర్పించారు. కొన్ని కీలకమైన ఆధారాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రాథమిక నివేదిక ఇప్పటికే అందింది.

గ్యాంగ్ రేప్ కు ముందు దిశ తన సోదరితో ఫోన్ లో మాట్లాడింది. ఈ ఫోన్ సంభాషణ విన్న వారు కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే. ఆ సంభాషణ సమయంలో తాను ఉన్న పరిస్థితిని దిశ తన సోదరికి వివరించారు.

గత ఏడాది నవంబర్ 27వ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు దిశ తొండుపల్లి టోల్ ప్లాజా సమీపంలోనే ఉన్నట్టుగా సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు గుర్తించారు.

దిశ గ్యాంగ్ రేప్ కు గురి కావడానికి ముందు మాట్లాడిన ఫోన్ సంభాషణ కూడ దిశ, ఆమె సోదరిదేనని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చినట్టుగా సమాచారం.
గ్యాంగ్ రేప్ కు  కొన్ని రోజుల ముందుగా దిశ ఫోన్ సంభాషణలను కూడ పోలీసులు సేకరించారు. ఎవరెవరితో ఆమె మాట్లాడిందనే విషయాలపై కూడ ఆరా తీశారు. 

తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద దిశ ఉన్న సమయంలో ఆమె బైక్ ను శివ తీసుకెళ్లడం.. దిశను నిందితులు తమ లారీలో తీసుకెళ్లిన దృశ్యాలను సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిందితుల ముఖాలను గుర్తు పట్టేందుకు వీలుగా ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు ఈ దృశ్యాలను డెవలప్ చేశారని సమాచారం. 

గత ఏడాది డిసెంబర్ 6వ తేదీన చటాన్ పల్లి వద్ద జరిగిన ఎన్ కౌంటర్  ప్రాంతంలో దొరికిన తూటాలు, రివాల్వర్లు బాలిస్టిక్ నిపుణులు పరిశీలించి రిపోర్టు సిద్దం చేశారని సమాచారం.
 

Follow Us:
Download App:
  • android
  • ios