సరదా కోసం డేటింగ్ యాప్ లింక్ నొక్కాడు.. న్యూడ్ చాట్ చేశాడు.. రెండేళ్లుగా నరకయాతన అనుభవించాడు...

అతనికి పెళ్లయ్యింది. అయినా డేటింగ్ యాప్ ట్రై చేద్దామనుకున్నాడు. సరదాగా యాప్ లింక్ లోకి వెళ్లాడు. ఇంకేముంది ఆ మాయలో న్యూడ్ చాటింగ్ కూడా చేశాడు. ఆ తరువాత రెండేళ్ల పాటు ఆ పాపానికి పరిహారంగా నరకయాతన అనుభవించాడు. 

Extortion on dating app, techie loses over Rs 2.18 lakhs in Hyderabad

హైదరాబాద్ : కొన్నిసార్లు తెలిసో తెలియకో.. సరదాగానో.. కాస్త వాంఛకు లోనయ్యో చేసే పనులు ఆ తరువాత దిద్దుకోలేని చిక్కుల్లో పడేస్తాయి. ఆ తప్పును దిద్దుకోలేక.. దాన్నుండి తప్పించుకోలేక.. ఆ నరకయాతన భరించలేక చాలాసార్లు ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. అందుకే అనైతికమైన పనులు చేయాలన్న ఆలోచన చేసేముందు ఒక్కసారి ఆలోచించాలి. అలా ఆలోచించకుండా ఆ.. ఏం కాదులే.. ఎవరు చూస్తారు.. నాకేం అవుతుంది.. అని ఇదిగో ఇలా చేస్తే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. వివరాల్లోకి వెడితే... 

డేటింగ్ యాప్ లింకు నొక్కిన పాపానికి ఓ ప్రైవేటు ఉద్యోగి రెండేళ్లు నరకయాతన అనుభవించాడు. మాటలతో నమ్మించి, నగ్నచిత్రాలు సేకరించి, సైబర్ నేరగాళ్లు అతడి నుంచి రూ.2.18లక్షలు గుంజారు. వ్యభిచార వెబ్సైట్లలో అతని ఫోన్ నెంబర్ పెట్టారు. ఈ వేధింపులు తట్టుకోలేక బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. మియాపూర్లోని మయూర్ నగర్లో ఉండే వ్యక్తి (32) 2020 ఆగస్టులో ఆన్లై లోన్లో ‘లొకాంటో’ పేరుతో ఉన్న డేటింగ్ యాప్ లింకు ను నొక్కాడు. శృతి పేరుతో  సైబర్ నేరగాళ్లు చాటింగ్ ప్రారంభించారు. శృతి, మోక్షపేర్లతో మభ్యపెట్టి నగ్న చిత్రాలు సేకరించి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. 

ప్రాణం మీదకు తెచ్చిన ఇన్ స్టా రీల్.. వీడియో చిత్రీక‌రిస్తుండ‌గా ఢీకొట్టిన రైలు..

అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నగ్నచిత్రాల స్క్రీన్ షాట్ లు భార్య, కుటుంబ సభ్యులు, బంధువులకు పంపిస్తామని, నేరుగా ఇంటికి వస్తామంటూ ఫోన్లు చేశారు. కుటుంబాన్ని చంపేస్తామంటూ భయపెట్టారు. ప్రతిసారి కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేసేవారు. అలా 70-100 వేర్వేరు నెంబర్లతో వేధించేవారు. అతని ఇంస్టాగ్రామ్ ఖాతాను హ్యాక్ చేసి స్నేహితుల ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలు సేకరించి, వారి వ్యక్తిగత సమాచారాన్ని పంపారు. అంతటితో ఆగకుండా ఫోన్ నెంబర్ను వ్యభిచారానికి సంబంధించిన వెబ్సైట్లో ఉంచారు. దీంతో ఫోన్లు పెరిగిపోయాయి. దీనికితోడు లోన్ ఆప్ ల నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించాలంటూ కొందరు ఫోన్ చేసి డిమాండ్ చేశారు. గూగుల్ పే,  ఫోన్ పే, పేటీఎం, బ్యాంకు ఖాతాల ద్వారా మూడు దఫాలుగా మొత్తం రూ.2.18లక్షలు గుంజారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios