సూర్యాపేట:  సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్టు ఆశించిన పటేల్ రమేష్‌రెడ్డి కన్నీరు పెట్టుకొన్నారు. రేవంత్ రెడ్డి వెంట టీడీపీని వీడి  కాంగ్రెస్ పార్టీలో పటేల్ రమేష్ రెడ్డి చేరారు.

2014 ఎన్నికల్లో సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుండి పటేల్ రమేష్ రెడ్డి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఈ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధి జగదీష్ రెడ్డి విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్ధి సంకినేని వెంకటేశ్వరరావుపై జగదీష్ రెడ్డి విజయం సాధించారు.

ఈ ఏడాది టీడీపీని  వీడిన రేవంత్ రెడ్డితో పాటు పటేల్ రమేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్  కమిటీ సభ్యలు పటేల్ రమేష్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డిని పిలిచి మాట్లాడారు.

టికెట్టు ఎవరికి వచ్చినా పార్టీ కోసం పనిచేయాలని సూచించారు.సర్వే ఆధారంగా టికెట్లను కేటాయించాలని  నిర్ణయం తీసుకొంటామని స్క్రీనింగ్ కమిటీ సభ్యులు తేల్చి చెప్పారు.

అయితే ఒకరికి సూర్యాపేట అసెంబ్లీ టికెట్టు, మరోకరికి నల్గొండ ఎ:పీ సీటును  ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు  ఆ సమావేశంలో ప్రకటించారు.సూర్యాపేట  కాంగ్రెస్ టికెట్టు కోసం పటేల్ రమేష్ రెడ్డి ఆశలు పెట్టుకొన్నారు.కానీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాంరెడ్డి దామోదర్ రెడ్డికి టికెట్టును కేటాయించింది.

కాంగ్రెస్ టికెట్టుపై ఆశలు పెట్టుకొన్న పటేల్ రమేష్ రెడ్డికి టికెట్టు దక్కకపోవడంతో  భార్య, కూతురును పట్టుకొని బుధవారం నాడు కన్నీళ్లు పెట్టుకొన్నారు. టికెట్టు దక్కకపోవడంతో  కన్నీళ్లు పెట్టుకొన్న పటేల్ రమేష్ రెడ్డిని  బంధువులు, స్నేహితులు ఓదార్చారు.

పటేల్ రమేష్ రెడ్డి భార్య గతంలో సూర్యాపేట జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. రమేష్ రెడ్డి స్వగ్రామం బాలెంల గ్రామం. రమేష్ రెడ్డి తండ్రి తెలంగాణ సాయుధపోరాట యోధుడు.

సంబంధిత వార్తలు

సీట్ల సర్దుబాటు: కాంగ్రెస్‌కు కోదండరామ్ డెడ్‌లైన్

కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్

పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

పొన్నాలకు కాంగ్రెస్ నేతల షాక్

పొన్నాలకు కోమటిరెడ్డి పొగ