హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి టీజెఎస్  డెడ్‌లైన్ పెట్టింది. మూడు సీట్ల విషయాన్ని బుధవారం సాయంత్రం లోపుగా తేల్చాలని అల్టిమేటం జారీ చేసింది.

తెలంగాణలో  టీఆర్ఎస్‌ను గద్దెదించేందుకు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, టీజేఎస్‌లు కూటమిగా ఏర్పడ్డాయి.  కాంగ్రెస్, టీజేఎస్ మధ్య ఆరుసీట్ల విషయంలో  స్పష్టత వచ్చింది. మిగిలిన ఐదు సీట్ల విషయంలో స్పష్టత రావాల్సి ఉందని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ చెబుతున్నారు.

కానీ కాంగ్రెస్ పార్టీ టీజేఎస్ కు మాత్రం ఎనిమిది సీట్లను మాత్రమే కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. కానీ, టీజేఎస్ మాత్రం 11 సీట్లను పొత్తులో భాగంగా  కోరుతున్నట్టు చెబుతోంది. మంగళవారం నాడు  టీజేఎస్  చీఫ్ కోదండరామ్ మీడియా ప్రతినిధులతో ఇదే విషయాన్ని చెప్పారు.

మిర్యాలగూడ,జనగామ, వరంగల్ ఈస్ట్ స్థానాల విషయంలో ఏదో ఒకటి ఫైనల్ చేయాలని  టీజేఎస్ కాంగ్రెస్ పార్టీని కోరుతోంది. బుధవారం సాయంత్రానికి  ఈ మూడు స్థానాల విషయాన్ని తేల్చాలని  కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ డెడ్‌లైన్ విధించింది.

జనగామ నుండి కోదండరామ్ పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ సీటులో కాంగ్రెస్ పార్టీ నేత మాజీ పీసీసీ అధ్యక్షుడు  పొన్నాల లక్ష్మయ్య కూడ  ఈ సీటును  ఆశిస్తున్నారు. మిర్యాలగూడ సీటును జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు.

ఈ సీటు కోసం జానారెడ్డి ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. అయితే  ఈ స్థానంలో టీజేఎస్ నేత ఒకరు తీవ్రంగా పట్టుబడుతున్నారు.ఈ తరుణంలో ఈ సీటుపై కూడ టీజేఎస్ తీవ్రంగా ఒత్తిడి చేస్తోంది.  వరంగల్ ఈస్ట్ కోసం కూడ టీజేఎస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది.ఈ సీట్లను త్వరగా తేల్చాలని  టీజేఎస్ కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీ చేసింది.

 

సంబంధిత వార్తలు

కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్

పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

జనగామ నుండి తప్పుకొన్న కోదండరామ్: పొన్నాలకు లైన్‌క్లియర్

జనగామ టికెట్ నాదే..ధీమా వ్యక్తం చేసిన పొన్నాల

కంగు తిన్న పొన్నాల: హుటాహుటిన ఢిల్లీకి పయనం

పొన్నాలకు షాక్: జనగామ నుంచి కోదండరామ్ కే చాన్స్

జనగామ పొన్నాలకే... హైకమాండ్ రహస్య సంకేతాలు: ఆ వర్గానికి షాక్

కన్నీళ్లు పెట్టుకున్న పొన్నాల లక్ష్మయ్య

జనగాం నుంచి కోదండరామ్ పోటీ: పొన్నాల ఆగ్రహం, టచ్ లో హరీష్

జనగామలో పొన్నాలకు కోడలు చిక్కులు

పొన్నాలకు కాంగ్రెస్ నేతల షాక్

పొన్నాలకు కోమటిరెడ్డి పొగ