Asianet News TeluguAsianet News Telugu

ఆదిలాబాద్ యువతకు వలపు వల.. న్యూడ్ కాల్స్ ‌చేసి, ఆపై డబ్బు కోసం బ్లాక్ మెయిల్

ఆదిలాబాద్ జిల్లాలో న్యూడ్ వీడియో కాల్స్ పేరుతో యువతకు గాలం వేస్తున్నారు . న్యూడ్ వీడియో కాల్ చేయడం ఆ తర్వాత డబ్బుల కోసం బ్లాక్ మెయిల్‌కు దిగుతున్నారు. మంగేష్ అనే న్యాయవాదికి ఓ యువతి డీపీతో వున్న నెంబర్ నుంచి న్యూడ్ కాల్ వచ్చింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు 

blackmailing girls by recording nude video in adilabad
Author
Adilabad, First Published Aug 11, 2022, 5:23 PM IST

ఆదిలాబాద్ జిల్లాలో న్యూడ్ వీడియో కాల్స్ పేరుతో యువతకు గాలం వేస్తున్నారు . న్యూడ్ వీడియో కాల్ చేయడం ఆ తర్వాత డబ్బుల కోసం బ్లాక్ మెయిల్‌కు దిగుతున్నారు. కొంతమందికి ఫోన్ చేసి వేధిస్తున్నారు యువతులు. ఆదిలాబాద్‌కి చెందిన మంగేష్ అనే న్యాయవాదికి ఓ యువతి డీపీతో వున్న నెంబర్ నుంచి న్యూడ్ కాల్ వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో నిరుడు నవంబర్ లో ఇలాంటి కేసే వెలుగు చూసింది. అందమైన అమ్మాయిల ఫొటోలు పంపి, ఆపై న్యూడ్ వీడియో కాల్ చేయించుకుని నగర వాసి నుంచి డబ్బులు వసూలు చేశారు సైబర్ నేరస్తులు. ఆ తరువాత అలా క్యాప్చర్ చేసిన వీడియోను అడ్డుపెట్టుకుని పలు దఫాలుగా పెద్ద మొత్తంలో లక్షలు వసూలు చేయడంతో బాధితుడు న్యాయం కావాలంటూ సిటీ సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించాడు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల నగర యువకుడికి ఓ వ్యక్తి అందమైన అమ్మాయిలా వాట్సప్ లో పరిచయం అయ్యాడు. సాంకేతికతను అడ్డంపెట్టుకుని పలుమార్లు అమ్మాయి గొంతుతో మాట్లాడారు. దుస్తులు ధరించినవి, దుస్తులు లేకుండా ఉన్న ఫొటోస్ పంపి ఇలా రెండు, మూడు పర్యాయాలు వాట్స్అప్ వీడియో కాల్ చేయించుకున్నారు. అవతలి వ్యక్తి కనిపించకుండానే... యువకుడిని దుస్తులు విప్పాలన్నారు. 

ALso Read:తోటి విద్యార్థినికి ‘ఐలవ్యూ’ చెప్పి.. న్యూడ్ వీడియో కాల్స్ చేయమని.. బ్లాక్ మెయిల్..

ఆ తరువాత యువకుడి వీడియోను రికార్డ్ చేశారు. ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే నీ నగ్న వీడియోను వాట్స్అప్ గ్రూపులో షేర్ చేయడంతోపాటు యూట్యూబ్ లో పోస్ట్ చేస్తామని బెదిరించారు. దీంతో వారు చెప్పిన విధంగా ఈ యువకుడు పలు దఫాలుగా ఇప్పటివరకు నాలుగు లక్షల రూపాయలు పంపాడు. కానీ, వీడియోను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయడం లేదు. పైగా మరి కొన్ని డబ్బులు కావాలని వేధిస్తుండడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిమీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios