Asianet News TeluguAsianet News Telugu

తోటి విద్యార్థినికి ‘ఐలవ్యూ’ చెప్పి.. న్యూడ్ వీడియో కాల్స్ చేయమని.. బ్లాక్ మెయిల్..

ఓ పదో తరగతి విద్యార్థి... తనతో చదువుకున్న అమ్మాయికి ఐలవ్యూ చెప్పాడు. ఆ తరువాత న్యూడ్ కాల్ చేయమని అడిగాడు.. దాన్ని రికార్డ్ చేసి ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. 

pocso case registered 'blackmailing' girl by recording nude video in tamilnadu
Author
hyderabad, First Published Jul 29, 2022, 10:44 AM IST

తిరువొత్తియూరు : దేశంలో ప్రతి రోజూ ఏదో ఒక చోట.. ఏదో ఒక రకంగా యువతులపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నగ్నంగా నిలబడి వీడియో కాల్ లో మాట్లాడమని చెప్పి రికార్డు చేసుకుని ఓ విద్యార్థినిని బెదిరిస్తున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కోవై సమీపంలో ఉన్న kovilpalayam కు చెందిన 16 ఏళ్ల విద్యార్థిని ప్లస్ వన్ చదువుతోంది. ఆ సమయంలో అదే తరగతిలో చదువుతున్న విద్యార్థితో పరిచయం ఏర్పడింది. అతను పదో తరగతి ఫెయిల్ కావడంతో చదువు ఆపేశాడు. ఆ తర్వాత వారిద్దరు సెల్ ఫోన్ లో మాట్లాడుకునే వారు. విద్యార్థినిని ప్రేమిస్తున్నాను అని చెప్పడంతో వీడియో కాల్ లో కూడా మాట్లాడుకునేవారు.

ఈ క్రమంలో ఓ సారి నగ్నంగా నిలబడి వీడియో కాల్ చేయమని అతను కోరాడు. దీంతో వీడియో కాల్ లో మాట్లాడినప్పుడు అతను రికార్డ్ చేసుకున్నాడు. ఆ తర్వాతికాలంలో పదేపదే అలాగే వీడియో కాల్ చెయ్యమని కోరుతుండడంతో.. ఆమె భయపడి తల్లిదండ్రులకు తెలిపింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ విద్యార్థినితో మాట్లాడుతున్న యువకుడి వివరాలు తెలియకపోవడంతో పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

స్నేహితురాలితో మంగళగిరి యువకుడి న్యూడ్ వీడియో కాల్... ఆ తర్వాతే అసలు ట్విస్ట్...

ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో నిరుడు నవంబర్ లో ఇలాంటి కేసే వెలుగు చూసింది. అందమైన అమ్మాయిల ఫొటోలు పంపి, ఆపై న్యూడ్ వీడియో కాల్ చేయించుకుని నగర వాసి నుంచి డబ్బులు వసూలు చేశారు సైబర్ నేరస్తులు. ఆ తరువాత అలా క్యాప్చర్ చేసిన వీడియోను అడ్డుపెట్టుకుని పలు దఫాలుగా పెద్ద మొత్తంలో లక్షలు వసూలు చేయడంతో బాధితుడు న్యాయం కావాలంటూ సిటీ సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించాడు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల నగర యువకుడికి ఓ వ్యక్తి అందమైన అమ్మాయిలా వాట్సప్ లో పరిచయం అయ్యాడు. సాంకేతికతను అడ్డంపెట్టుకుని పలుమార్లు అమ్మాయి గొంతుతో మాట్లాడారు. దుస్తులు ధరించినవి, దుస్తులు లేకుండా ఉన్న ఫొటోస్ పంపి ఇలా రెండు, మూడు పర్యాయాలు వాట్స్అప్ వీడియో కాల్ చేయించుకున్నారు. అవతలి వ్యక్తి కనిపించకుండానే... యువకుడిని దుస్తులు విప్పాలన్నారు. 

ఆ తరువాత యువకుడి వీడియోను రికార్డ్ చేశారు. ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే నీ నగ్న వీడియోను వాట్స్అప్ గ్రూపులో షేర్ చేయడంతోపాటు యూట్యూబ్ లో పోస్ట్ చేస్తామని బెదిరించారు. దీంతో వారు చెప్పిన విధంగా ఈ యువకుడు పలు దఫాలుగా ఇప్పటివరకు నాలుగు లక్షల రూపాయలు పంపాడు. కానీ, వీడియోను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయడం లేదు. పైగా మరి కొన్ని డబ్బులు కావాలని వేధిస్తుండడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిమీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios