తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత రాములమ్మ మరోసారి విరుచుకుపడింది. భాష గురించి, ప్రవర్తన గురించి కేసీఆర్ చెబితే వినాల్సి రావడం విడ్డూరంగా ఉందంటూ ఫైర్ అయ్యింది. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత రాములమ్మ మరోసారి విరుచుకుపడింది. భాష గురించి, ప్రవర్తన గురించి కేసీఆర్ చెబితే వినాల్సి రావడం విడ్డూరంగా ఉందంటూ ఫైర్ అయ్యింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు జరిగిన ప్రచార సభల్లో ప్రతిపక్షాలను సాక్షాత్ సీఎం కేసీఆరే అత్యంత అసభ్యకరంగా మాట్లాడారని మండిపడ్డారు. ఈ విషయం ప్రజలందరూ చూశారని విజయశాంతి అన్నారు. 

మొన్నటికి మొన్న హాలియాలో జరిగిన సభలో కూడా బాధిత మహిళలను కేసీఆర్ కుక్కలని సంభోదించాడని ఫేస్ బుక్ వేదికగ రాములమ్మ విరుచుకుపడ్డారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు భాష, ప్రవర్తన, నియమావళి గురించి చెబుతుంటే వినాల్సి రావడం విడ్డూరంగా ఉందన్నారు. 

ఫేస్ బుక్ అఫీషియల్ ఖాతాలో ఆమె ఇలా పోస్ట్ చేశారు.. ‘‘ జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు జరిగిన ప్రచార సభల్లో ప్రతిపక్షాలను ఉద్దేశించి సాక్షాత్తూ సీఎం అత్యంత అసభ్యకరంగా మాట్లాడడం ప్రజలు చూశారు. ఇటీవల జరిగిన హాలియా సభలో బాధిత మహిళలను కుక్కలు అనడం చూశాం. గతంలో ఎన్నోసార్టు అనేకమంది నాయకులు, పార్టీలను, ప్రజలను అవమానకరంగా దుర్భషలాడటం చూశాం.

ఇప్పుడు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు భాష, ప్రవర్తన, నియమావళి గురించి అదే ముఖ్యమంత్రి గారు చెబితే వినాల్సి రావడం విడ్డూరం. కనీస రాజకీయ సంస్కారం కూడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడే ఈ సీఎంగారిని ఒక్కమా ఎదిరించి అనరాదని టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ముఖ్యనేతలు ఇయ్యాల అరుపులు, పెడబొబ్బలు పెడుతున్నారు. 

ఇది నిజాం పాలన.. రాజుల కాలం కాదు.. ప్రజాస్వామ్యం. ఏది ఏమైనా కరోరా రెండో డోసుకు ఆరోగ్య శాఖ సిద్దమవుతున్నట్లే, తెరాసకు దుబ్బాక, జీహెచ్ఎంసీ తీరున మరో డోసు ఇయ్యనీకి రానున్న ఎమ్మెల్సీ, సాగర్, కార్పొరేషన్ల ఎన్నికల కోసం ప్రజలు సిద్దంగా ఉన్నారు. ఒకనాడు తెలంగాణకు కాపల కుక్కగా ఉంటానన్న ముఖ్యమంత్రి ఇయ్యా తెలంగాణ ప్రజలనే కుక్కలు అనబడితే.. అందుకు పరిష్కారమేంటో ప్రజలకు తెల్వదా?’’ అని విజయశాంతి పేర్కొన్నారు.