చైనాకి చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో.. కష్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఒప్పో తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ ఒప్పో ఎఫ్‌7 పై ధర తగ్గించింది. గతేడాది 22,990 రూపాయలకు లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను 3 వేల రూపాయలు తగ్గించి, 19,990 రూపాయలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. 

కంపెనీ ధర తగ్గింపుతో పాటు, ఫ్లిప్‌కార్ట్‌  కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌పై పలు ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.12,200 వరకు ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ను అందించనున్నామని, నెలకు రూ.664 ఈఎంఐ ఆఫర్‌ ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. 

యాక్సిస్‌ బ్యాంక్‌ బుజ్‌ క్రెడిట్‌ కార్డు హోల్డర్స్‌కు తమ బుజ్‌ క్రెడిట్‌ కార్డుపై 5 శాతం తగ్గింపు, వీసా కార్డు యూజర్లకు తొలి మూడు ఆన్‌లైన్‌ పేమెంట్లపై 5 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తోంది. ఒప్పో ఎఫ్‌7 రెండు వేరియంట్లలో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఒకటి 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, రెండు 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌. ధర తగ్గింపుతో ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు రూ.19,990కు, రూ.23,990కు లభ్యమవనున్నాయి.

ఒప్పో ఎఫ్‌7 ఫీచర్లు..
బెజెల్‌-లెస్‌ 6.23 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
టాప్‌లో కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌
ఐఫోన్‌ ఎక్స్‌ మాదిరి నాచ్‌
మీడియాటెక్‌ హిలియో పీ60 ఆక్టా-కోర్‌ ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆపరేటింగ్‌ సిస్టమ్‌
25 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్‌ ఏఐ బ్యూటీ టెక్నాలజీ 2.0
వెనుక వైపు 16 ఎంపీ షూటర్‌ విత్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌
3,400 ఎంఏహెచ్‌ బ్యాటరీ