MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • హిందువుల‌పై దాడులు.. బంగ్లాదేశ్ పై భార‌త్ ఫైర్.. త‌క్షణ చ‌ర్య‌లు తీసుకోండి

హిందువుల‌పై దాడులు.. బంగ్లాదేశ్ పై భార‌త్ ఫైర్.. త‌క్షణ చ‌ర్య‌లు తీసుకోండి

Bangladesh-Hindus : బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. ఇదే విష‌యంపై గురువారం మధ్యాహ్నం ప్రధాని మోడీని కలిశారు.  హిందువులు, హిందూ దేవాల‌యాల‌పై జ‌రుగుతున్న దాడుల‌పై ఆందోళ‌న‌లు వ్య‌క్తంచేశారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Nov 28 2024, 08:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
pm modi bangladesh

pm modi bangladesh

నవంబర్ 25న ఢాకా విమానాశ్రయంలో హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణ దాస్ ప్రభును అరెస్టు చేసిన తర్వాత భారీ నిరసనలు బంగ్లాదేశ్‌ను కదిలించాయి. అరెస్టయిన హిందూ సన్యాసి చిన్మోయ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చిట్టగాంగ్‌లోని కోర్టు వెలుపల వేలాది మంది గుమిగూడినప్పుడు సైఫుల్ ఇస్లాం అలీఫ్ అనే న్యాయవాది హ‌త్య‌కు గుర‌య్యారు. కృష్ణ దాస్ ప్రభుకు బెయిల్ నిరాకరించారు. దేశద్రోహ ఆరోపణలపై జైలుకు పంపారు. ఇటీవ‌ల‌ బంగ్లాదేశ్ లో హిందువులు, హిందుదేవాల‌యాల‌పై ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డంపై ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
s jaishankar

s jaishankar

ఈ క్ర‌మంలోనే బంగ్లాదేశ్ లో హిందువ‌లు భ‌ద్ర‌త‌ను నిర్ధారించాల‌ని భార‌త్ ఆ దేశ ప‌రిస్థితుల‌పై స్పిందించింది. బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న హిందువుల‌పై దాడులు, హిందూ దేవాలయాలు, దేవతలను అపవిత్రం చేయడం, హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బతీసే సంఘటనల గురించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఆందోళన వ్య‌క్తం చేసింది. బంగ్లాదేశ్‌లోని మతపరమైన ప్రదేశాలు, మైనారిటీల భద్రతకు సంబంధించిన ప్రశ్నలకు MEA రాజ్యసభలో రాతపూర్వక ప్రతిస్పందనను అందించింది.

34

దాడుల‌ సంఘటనలు జరిగినట్లు ధృవీకరించింది. బంగ్లాదేశ్‌లోని హిందూ మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడంపై భారతదేశం తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేస్తున్న‌ట్టు పేర్కొంది. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం అధికారికంగా ఈ సమస్యలను లేవనెత్తిందనీ, అన్ని ఇతర మైనారిటీ కమ్యూనిటీలు-వారి ప్రార్థనా స్థలాలతో పాటు హిందువుల భద్రత నిర్ధారించడానికి తక్షణ-నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని వారిని కోరిన‌ట్టు విదేశాంగ‌ మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది.

 

44

బంగ్లాదేశ్‌లోని హిందూ దేవాలయాలు, దేవతలను అపవిత్రం చేయడం, పాడు చేయడం వంటి అనేక సంఘటనలు గత కొన్ని నెలలుగా నివేదించబడ్డాయి. ఢాకాలోని తాంతిబజార్‌లోని పూజా మండపంపై దాడి, దొంగతనం సహా అటువంటి సంఘటనల గురించి భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. 2024 దుర్గాపూజ సందర్భంగా సత్ఖిరాలోని జెషోరేశ్వరి కాళీ దేవాలయంలో దాడిని కూడా ప్ర‌స్తావించింది.

మైనారిటీ సమూహాలతో సహా జీవ‌నం, స్వేచ్ఛ రక్షణ ప్రాథమికంగా బంగ్లాదేశ్ ప్రభుత్వ బాధ్యత అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా బంగ్లాదేశ్ మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలనీ, దాని పౌరులందరూ శాంతియుత సహజీవనం కొన‌సాగించేలా చూడాల‌ని కోరింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
నరేంద్ర మోదీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Recommended image2
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image3
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved