Asianet News TeluguAsianet News Telugu

5జీ తంటా: హువావేకు ఫేస్‌బుక్ ‘యాప్స్ ’షాక్

5జీలో ప్రపంచానికి చుక్కానిగా నిలుస్తున్న చైనా స్మార్ట్ ఫోన్ మేజర్ హువావేకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధిస్తే.. తమ యాప్స్ ఇన్ స్టలేషన్‌ నిలిపేస్తామని గూగుల్ ‘ఆల్పాబేట్’ తేల్చేసింది. ఆ దారిలో ఫేస్ బుక్ కూడా తమ యాప్స్ నిలిపేస్తామని తాజాగా ప్రకటించింది.
 

Facebook stops Huawei from pre-installing apps on phones
Author
Hyderabad, First Published Jun 8, 2019, 10:04 AM IST

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువావేకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే హువావేపై అమెరికా ఆంక్షల కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. హువావేకు ఎలాంటి సాయం చేయొద్దని టెక్నాలజీ సంస్థలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశించింది. 

ఈ నేపథ్యంలో గూగుల్‌ సహా పలు టెక్‌ కంపెనీలు భవిష్యత్‌లో తమ సేవలను అందించబోమని తెలిపాయి. కాగా, ఇప్పుడు సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హువావే కొత్త ఫోన్లలో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లు ప్రీ-ఇన్‌స్టాల్‌ యాప్‌లు లభించవు.

వాటిని తప్పక డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందే. ఇప్పటికే హువావే ఫోన్లు వినియోగిస్తున్న వారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్ని అప్‌డేట్స్‌ ఇస్తామని ఫేస్‌బుక్‌ తెలిపింది. 

ఫేస్‌బుక్‌, ట్విటర్‌లాంటి సోషల్ మీడియా యాప్‌లు కొత్త మొబైల్స్‌లో ప్రీ-ఇన్‌స్టాల్‌ అయి రావడానికి ముందుగానే ఒప్పందం చేసుకుంటాయి. ఇటు మొబైల్‌ కంపెనీలకు, అటు సోషల్‌మీడియాకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. 

 హువావేలో ఫేస్‌బుక్‌, ట్విటర్‌, బుకింగ్‌.కామ్‌ వంటి యాప్‌లు ప్రీ-ఇన్‌స్టాల్‌ అయి వస్తుంటాయి. ఫేస్‌బుక్‌ నిర్ణయంపై ట్విటర్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక ఇటీవల గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. 90 రోజుల తర్వాత హువావే కొత్త ఫోన్లకు గూగుల్‌ సేవలు ఏవీ అందుబాటులో ఉండవు. 

ప్రస్తుతం హువావే ఫోన్లు కొనుగోలు చేయాలనకున్న వారికి  ఫేస్‌బుక్‌ ప్రీ-ఇన్‌స్టాల్‌ యాప్‌గా లభించదు. అయితే, గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి వారు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

కానీ, 90రోజుల తర్వాత గూగుల్‌ ప్లేస్టోర్‌ యాక్సెస్‌ను కూడా హువావే కొత్త ఫోన్లకు ఇవ్వదు. దీంతో ఆయా మొబైల్స్‌ కొనుగోలు చేసేవారికి ఫేస్‌బుక్‌ వినియోగించడం కష్టమే.

Follow Us:
Download App:
  • android
  • ios