Asianet News TeluguAsianet News Telugu

ఐటీ దిగ్గజాలకు కరోనా ముప్పు: స్టార్టప్ సంస్థల ఉద్యోగులు ఇంటికి...

కరోనా మహమ్మారి వల్ల ప్రభావం కానీ రంగమేదీ లేదు. దీనివల్ల అమెరికా, ఐరోపా దేశాలు టెక్నాలజీ వినియోగంపై ఖర్చు తగ్గించడం వల్ల భారతీయ ఐటీ దిగ్గజాల రెవెన్యూపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికే రద్దయ్యాయి. ఇక మరోవైపు, పలు స్టార్టప్ సంస్థలు తమ మనుగడ కోసం ఉద్యోగులకు ఇంటికి సాగనంపుతున్నాయి.

Coronavirus attack to slow down IT growth
Author
Hyderabad, First Published Apr 4, 2020, 2:19 PM IST

ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వల్ల ఐటీ దిగ్గజాలు ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు క్షీణిస్తుందని అంచనా వేస్తున్నాయి. కొవిడ్‌-19తో జనజీవనం స్తంభించంది. వాణిజ్య కార్యకలాపాలు నిలిచి పోతుండటంతో ఐటీ ఎగుమతులపైనా పెను ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు వల్ల అమెరికా, యూరప్‌ దేశాల్లోని క్లయింట్లు టెక్నాలజీపై వ్యయాల్లో కోత విధిస్తుండటంతో దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సంస్థలపై ప్రతికూల ప్రభావం పడనుందని ఐటీ విశ్లేషకులు భావిస్తున్నారు. 

వచ్చే ఆరునెలల్లో ఐటీ రంగంలో రాబడి రెండు నుంచి ఏడు శాతం తగ్గుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషించిందని ఓ వార్తాసంస్ధ తెలిపింది. వైరస్‌ వల్ల నిర్ణయాలు తీసుకోవడం, వాటి అమలులో జాప్యాల వంటి కారణాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసాల్లో రాబడి గణనీయంగా తగ్గవచ్చని మరికొందరు నిపుణులు విశ్లేషించారు. 

టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ ఈ ఏడాది ప్రధమార్ధంలో వృద్ధి రేటు మందగమనాన్ని ఎదుర్కొంటాయని అంచనా వేశారు. ఐటీ కంపెనీలు ధరల ఒత్తిళ్లను ఎదుర్కొంటాయని, ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రభావంతో రాబడి నష్టం వాటిల్లుతుందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ ప్రతినిధి దేవాంగ్‌ భట్‌ పేర్కొన్నారు. 

కొవిడ్‌-19 ప్రభావంతో వ్యాపారం దెబ్బతినే క్రమంలో వృద్ధి రేటును యాక్సెంచర్‌ 6-8 శాతం నుంచి 3-6 శాతానికి కుదించిన బాటలోనే భారత ఐటీ కంపెనీలు నడుస్తాయని అంచనా వేస్తున్నారు. 

మరోవైపు రవాణాపై ఆంక్షలు సైతం ప్రాజెక్టుల అమలులో జాప్యానికి కారణం అవుతున్నాయి. ట్రావెల్‌, ఆతిథ్యం, విమానయానం‌, రిటైల్‌, హైటెక్‌, ఫైనాన్షియల్‌, తయారీ రంగాల క్లయింట్ల నుంచి వచ్చే వ్యాపారం వైరస్‌ మహమ్మారితో దెబ్బతినవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఇక కరోనా కేంద్రస్ధానమైన చైనాలో ఆర్థిక మందగమనం కూడా దేశీయ ఐటీ రంగంపై పరోక్ష ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసుల ఎగుమతులు 8.1 శాతం పెరిగి 147 బిలియన్ డాలర్లకు పెరిగాయని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్‌కామ్) తెలిపింది. 

ట్రావెల్ ఆంక్షలు అమలులోకి రావడం వల్ల ఐటీ దిగ్గజ సంస్థలు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ సంస్థల ప్రాజెక్టుల పూర్తిలో జాప్యం కానున్నది. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ సంస్థలు తమ రెవెన్యూ గైడెన్స్ ఏడాది మొత్తానికి నిర్ణయిస్తుంటాయి. విప్రో మాత్రం క్వార్టర్‌కోసారి గైడెన్స్ అంచనా వేస్తుంది. 

ఈ నెల రెండో వారంలో ఇండియన్ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు వెలువరించనున్నాయి. చైనాలో ఆర్థిక మందగమనం ప్రభావం భారత ఐటీ సంస్థలపై పరోక్షంగా పడుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 

also read స్మార్ట్ ఫోన్లకు కరోనా సెగ... ఆ ఫోన్లకు పెరిగిన డిమాండ్‌...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెవెన్యూ గైడెన్స్‌పై స్పందించేందుకు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో నిరాకరించాయి. ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టుల్లో జాప్యం అవుతుందని, ప్రస్తుత సంక్షోభంలో చిక్కుకున్న క్లయింట్లు పేమెంట్స్ చెల్లింపుల్లో జాప్యం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయా ప్రాజెక్టులను తక్కువ ధరలకే చేపట్టాల్సి వస్తుందని, పాత ప్రాజెక్టుల పునరుద్ధరణ కూడా అదే స్థాయికి చేరుకుంటుందన్నాయి. 

ఎంకే గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ ఎనలిస్ట్ మానిక్ తనేజా స్పందిస్తూ ఇండియన్ ఐటీ దిగ్గజాలను ప్రథమార్థంలో తమ అంచనాలను సరిదిద్దుకోవాల్సి వస్తుందన్నారు. శరవేగంగా మారుతున్న పరిస్థితుల్లో నష్టం ఎంత అన్నది అంచనా వేయడం కష్ట సాధ్యం అని చెప్పారు. 

ఇటీవలి కాలంలో ఇండియన్ ఐటీ సంస్థలకు వచ్చిన ప్రాజెక్టులు రద్దయ్యాయి. కరోనా మహమ్మారి ప్రభావంతో విమాన ప్రయాణాల తగ్గింపు, నగరాలు, దేశాల లాక్ డౌన్ దీనికి కారణమని చెబుతున్నారు. 

గోల్డ్ మ్యాన్ సాచెస్ గత వారం స్పందిస్తూ భారత్, చైనా మినహా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మాంద్యంలో చిక్కుకుంటుందని అంచనా వేసింది. చారిత్రక స్థాయిలో మాంద్యంలో కూరుకుంటుందని పేర్కొంది.


ఇదిలా ఉంటే కరోనా ఎఫెక్ట్‌‌తో భారీ ఎత్తున ఉద్యోగాలకు కోత పడుతోంది. స్టార్టప్‌‌లు ఉద్యోగుల కోత ప్రారంభించాయి. స్టాఫ్‌‌ను తగ్గించడంతో పాటు, కొంత మంది ఉద్యోగులకు జీతాలనూ తగ్గిస్తున్నట్టు కొన్ని సంస్థల ఉద్యోగులు తెలిపారు. కరోనా దెబ్బకు ఎక్కడిక్కడ వ్యాపారాలన్ని స్తంభించి, దేశాల ఆర్థిక వ్యవస్థలన్ని కుప్పకూలిన సంగతి తెలిసిందే. 

వ్యాపారాలు రన్ అయ్యేందుకు పలు కఠిన చర్యలు తీసుకుంటున్నా పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయన్నది తెలియడం లేదని ఉద్యోగులకు కంపెనీల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆన్‌‌లైన్ ఇన్సూరెన్స్ సంస్థ అక్కో 50 మంది ఉద్యోగులను తీసేసింది. 

వీరిలో ఎక్కువగా కస్టమర్ సర్వీస్, ఆపరేషన్స్, సేల్స్, మార్కెటింగ్ సెగ్మంట్లలో పనిచేసేవారే ఉన్నారు. ఓ ఇంగ్లీష్ వెబ్‌‌సైట్‌‌కి ఇచ్చిన సమాధానంలో కరోనా దెబ్బకు 50 మంది వరకు ఉద్యోగులు ప్రభావితమైనట్టు అక్కో ఫౌండరో వరుణ్ దువా చెప్పారు. ఇది అనూహ్య పరిణామమని, ఈ పరిస్థితికి తాము సిద్ధం కావాలని దువా అన్నారు.

లీడర్‌‌‌‌షిప్ టీమ్‌‌లో కూడా 50 శాతం నుంచి 70 శాతం వరకు వాలంటరీగా వేతనాన్ని కట్ చేసుకోవాలని ఉద్యోగులకు దువా పిలుపునిచ్చారు. కొన్ని వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయని, అవి లాంగ్‌‌ టైమ్‌‌లో కూడా రికవరీ అయ్యే సూచనలు కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 

వీటిలో తాము తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులను తీసివేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. కొన్ని రోల్స్‌‌లో టీమ్స్‌‌ ను కన్సాలిడేట్ చేస్తున్నట్టు తెలిపారు. వచ్చే రెండు నెలలు రూ.40 వేల వేతనం ఉన్న వారికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని క్లౌడ్ కమ్యూనికేషన్ సంస్థ ఎక్సోటెల్ చెప్పింది. నెల తర్వాత పరిస్థితి చూసి, తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. 

వేతనాల కోత వంటి చర్యలను తాము తీసుకుంటున్నామని, కష్ట సమయంలో కంపెనీ నిలదొక్కుకోవాలంటే ఈ చర్యలు తప్పనిసరి అని ఎక్స్‌‌టెల్ సీఈవో శివకుమార్ గణేషన్ చెప్పారు. అయితే ఈసాప్స్ రూపంలో తమ ఉద్యోగులకు పరిహారాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. అమెరికాకు చెందిన ట్రావెల్ కంపెనీ ఫేర్‌‌‌‌పోర్టల్ కూడా ఇండియాలో 500 మందిని తీసేసింది. వారికి గత వారమే అధికారికంగా నోటిఫికేషన్ పంపింది.

Follow Us:
Download App:
  • android
  • ios