స్మార్ట్ ఫోన్లకు కరోనా సెగ... ఆ ఫోన్లకు పెరిగిన డిమాండ్‌...

కరోనా వైరస్.. దాని నియంత్రణకు లాక్ డౌన్.. విదేశీ విమానాల సర్వీసుల నిలిపివేత.. దిగుమతులు లేక.. ఉత్పత్తి సాగక టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ల కోసం డిమాండ్‌తో ధరలు పెరిగాయి. దీనికి తోడు జీఎస్టీ వల్ల నోకియా తన స్మార్ట్ ఫోన్ల ధరలను భారీగా పెంచుతున్నట్లు వెల్లడించింది. దీనికి భిన్నంగా చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ బ్రాండ్ హానర్ మాత్రం తమ ఉత్పత్తుల ధరలను పెంచడం లేదని తేల్చేసింది.

iPhone 11 Pro Price in India Hiked; iPhone 11 Pro Max, iPhone 8, iPhone 8 Plus Get New Prices as Well

న్యూఢిల్లీ: లాక్ డౌన్‌తో దేశంలో ఇప్పటికే ఆర్ధిక పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. ఇప్పుడు ఈ సెగ  స్మార్ట్ ఫోన్లకు తగిలింది. మొబైల్ ఫోన్లు, వాటి విడి భాగాలపై 12 శాతం ఉన్న జీఎస్టీ ఇప్పుడు 18 శాతానికి పెరగడంతో ఒక్కసారిగా వాటి ధర రెట్టింపయ్యింది. 

డిమాండ్ కలిసి రావడంతో ఐఫోన్ ధర పెరుగుదల
లాక్ డౌన్ వల్ల ఆపిల్ సంస్థ ‘ఐ ఫోన్ల’ ఉత్పత్తి ఆగిపోవడంతో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉన్నది. దీని వల్ల మార్కెట్లో ఉన్న ఆపిల్‌ ఫోన్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీనికి తోడు జీఎస్టీ పెంచడంతో సవరించిన ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వచ్చాయి.  ఇందులో భాగంగా 64 జీబీ రామ్ సామర్థ్యం గల ‘ఐఫోన్‌ 11’ మోడల్ ధర రూ.64,900 నుంచి రూ.68,300లకు చేరింది. 

రూ.1,600 నుంచి రూ.5,400 మధ్య ఐఫోన్ ధరలు పెరుగుదల
64 జీబీ రామ్ సామర్థ్యం గల ఐఫోన్ ఎక్స్‌ఆర్‌ మోడల్‌ ఫోన్ ధర రూ.2,600 పెరిగి రూ.52,500లకు చేరింది. ఇక 64 జీబీ సామర్థ్యంతో కూడిన ఐఫోన్ 11 ప్రో మోడల్ ధర రూ.1,01,200 నుంచి రూ.1,06,600కు చేరింది. 64 జీబీ రామ్ సామర్థ్యం గల ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్‌ ఫోన్ ధర రూ.1,11,200 నుంచి రూ.1,17,100కు చేరుకుంది. ఇక 32 జీబీ రామ్ సామర్థ్యం గల ఐఫోన్‌ 7 ధర రూ.1,600 పెరిగి రూ.31,500లుగా ఉంది.

also read బీఎస్ఎన్‌ఎల్ సూపర్బ్ డేటా ప్లాన్లు: రూ.693& రూ.1212

నోకియా స్మార్ట్ ఫోన్ల ధరలు పెరుగుదల
జీఎస్టీ శ్లాబ్ పెరగడంతో నోకియా స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరిగాయి. నోకియా 2.3, నోకియా 110, నోకియా 6.2, నోకియా 7.2, నోకియా 105, నోకియా 2.2, నోకియా 4.2, నోకియా 3.2, నోకియా 9 వంటి మోడళ్ల ధరలు పెరిగాయి. నోకియా 2.3 ధర ఇప్పుడు రూ.7,585కు పెరిగింది. 

ఇలా పెరిగిన నోకియా స్మార్ట్ ఫోన్ల ధరలు
నోకియా 110 అసలు ధర రూ.1599 కాగా ఇప్పుడు రూ.1684కు పెరిగింది. నోకియా 6.2 ధర ఇప్పటి వరకు రూ. 12,499గా ఉండగా ఇప్పుడు రూ. 13,168కి పెరిగింది. నోకియా 7.2 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ స్టోరేజీ ధరను ఈ ఏడాది మొదట్లో  రూ. 18,599 నుంచి రూ.15,499కి తగ్గించింది. అయితే ఇప్పుడు దీని ధరను  రూ.16,330కి పెంచింది. 

నోకియా 9ఫ్యూర్ వ్యూ లాంచింగ్ రూ.2678 పెరుగుదల
నోకియా 105, నోకియా 2.2, నోకియా 3.2 ధరలు ఇప్పుడు వరుసగా రూ.1,053, రూ.6,320, రూ.10,008, రూ.8,428గా ఉన్నాయి. నోకియా 9ప్యూర్ వ్యూ లాంచింగ్ ధర రూ.49,999గా ఉండగా ఇప్పుడు దీని ధర రూ. 52,677కు పెరిగింది. అంటే రూ.2,678 పెరిగిందన్నమాట. 

జీఎస్టీ పెంచినా ధరలు పెంచబోమన్న హానర్
కేంద్రప్రభుత్వం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) 12 శాతం నుంచి 18 శాతానికి పెంచినా తమ స్మార్ట్ ఫోన్ల ధరలు పెంచబోమని చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్ ఇండియా పేర్కొంది. హానర్ 9ఎక్స్, హానర్ 20 స్మార్ట్ ఫోన్ల ధరల్లో ఎటువంటి మార్పులు చేయబోవడం లేదని స్పష్టం చేసింది. ఈ ధరల పెంపు ప్రభావం 80 కోట్ల మంది మొబైల్ ఫోన్ల కొనుగోలుదారులపై పడుతుందని స్మార్ట్ ఫోన్ల తయారీ దారుల సంఘం ఐసీఈఏ వెల్లడించింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios