కరోనా వ్యాక్సిన్ కోసం భారత ప్రభుత్వ యాప్: మీరు తెలుసుకోవలసిన విషయాలు ఇవే..
దేశంలోని మూడు పెద్ద కంపెనీలు కరోనా వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగం కోసం వాడటానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అటువంటి పరిస్థితిలో, టీకాకు సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తేదీ లేదా సూచనలు వెల్లడించనప్పటికీ, ప్రభుత్వం త్వరలోనే టీకా ప్రారంభించవచ్చని భావిస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాక్సిన్‌పై ప్రపంచంలోని చాలా దేశాలు చివరి దశ ట్రయల్స్ జరుపుతున్నాయి. ఈ జాబితాలో భారతదేశం కూడా ఉంది. దేశంలోని మూడు పెద్ద కంపెనీలు కరోనా వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగం కోసం వాడటానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయి.
అటువంటి పరిస్థితిలో, టీకాకు సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తేదీ లేదా సూచనలు వెల్లడించనప్పటికీ, ప్రభుత్వం త్వరలోనే టీకా ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, టీకా నమోదు కోసం ప్రభుత్వం ఒక యాప్‌ను రూపొందించిందని, ఇది మొత్తం టీకా కార్యక్రమం ఎలా నిర్వహించబడుతుందనే వివరాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది.
ఈ యాప్ పేరు కో-విన్, ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ (ఇవిన్) అప్‌గ్రేడ్ వెర్షన్. గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ స్టోర్‌లో కో-విన్ ఇంకా అందుబాటులో లేనప్పటికీ కో-విన్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కో-విన్ యాప్ గురించి వివరంగా తెలుసుకుందాం ...
కో-విన్ అనేది మొబైల్ యాప్ దీనిని అందరూ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ యాప్‌లో టీకా ప్రక్రియ, కార్యకలాపాలు, టీకాల గురించి పూర్తి సమాచారం ఉంటుంది. స్వీయ నమోదు కోసం ఒక ఆప్షన్ కూడా ఉంటుంది.
also read ఆపిల్ ఐఫోన్ దారిలో శామ్‌సంగ్.. ఈ ఫోన్ బాక్సులో ఇక ఛార్జర్ లభించదు..! ...
టీకాలు మూడు దశల్లో ఉంటాయి
భారతదేశంలో కరోనా టీకా మొదట్లో మూడు దశల్లో జరుగుతాయి. ఇందులో ప్రజలకు దశలవారీగా టీకాలు వేస్తారు. మొదటి దశలో కరోనా వ్యాక్సిన్ ఆరోగ్య సంరక్షణ నిపుణులకు, రెండవ దశలో అత్యవసర సేవలతో సంబంధం ఉన్నవారికి ఇవ్వబడుతుంది.
వీరి డాటాను సేకరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. మూడవ దశలో కొన్ని తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకాలు వేస్తారు. ఇవన్నీ కో-విన్ యాప్‌లోనే నమోదు చేయబడతాయి.
ప్రతి టీకాకు కనీసం 30 నిమిషాలు పడుతుందని, ప్రతి సెషన్‌లో 100 మందికి మాత్రమే నిర్వహించబడుతుందని నివేదికలు తెలిపాయి.
కో-విన్ యాప్‌లో అడ్మినిస్ట్రేటర్ మోడ్యూల్, రిజిస్ట్రేషన్ మోడ్యూల్, వాక్శీనేషన్ మోడ్యూల్, బెనిఫిసియారి అప్రూవల్ మోడ్యూల్, రిపోర్ట్ మోడ్యూల్‌తో మొత్తం ఐదు మాడ్యూల్స్ ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ విలేకరుల సమావేశంలో పేర్కొంది. ఈ మాడ్యూళ్ళలో మొదటిది అడ్మినిస్ట్రేటివ్ మాడ్యూల్, దీనిలో టీకా కోసం సెషన్ నిర్ణయించబడుతుంది.
రిజిస్ట్రేషన్ మాడ్యూల్‌లో మీరు టీకా కోసం స్వయంగా నమోదు చేసుకోవచ్చు. ఈ మాడ్యూల్ లో ఒక సంస్థ టీకా అవసరమైన వారి కోసం పెద్దమొత్తంలో నమోదు చేయవచ్చు.
రిపోర్ట్ మాడ్యూల్ లో ఎన్ని వ్యాక్సిన్ సెషన్లు నిర్వహించింది, ఎంత మంది హాజరయ్యారు, ఎంత మంది తప్పుకున్నారు వంటి నివేదికలను సిద్ధం చేస్తుంది.