MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • 'ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్' (వెబ్ సీరిస్) OTT రివ్యూ

'ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్' (వెబ్ సీరిస్) OTT రివ్యూ

ఈ సీరిస్ ఓ పొలిటికల్ థ్రిల్లర్ గా కనిపిస్తుంది. మన దేశ స్వాతంత్య్ర కాలం నాటి అనేక విషయాలను స్పృశిస్తుంది. అప్పటి జీవితాలను,  సమస్యలను, దేశభక్తిని, స్వాతంత్ర్య ఆకాంక్షను మన ముందుకు ఉంచుతుంది. 

3 Min read
Surya Prakash
Published : Nov 27 2024, 07:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Nikkhil Advani, Freedom at Midnight, Ott review

Nikkhil Advani, Freedom at Midnight, Ott review

దాదాపు యాభై ఏళ్లనాటి  ఈ పాపులర్ పుస్తకం అదీ మన దేశ స్వాతంత్ర్యం కు సంభందించిన సంఘటనతో కూడిన విషయాలతో కూడుకున్నది తెరకెక్కకపోవటం ఆశ్చర్యమే అనిపిస్తుంది. కమర్షియల్ సినిమాకానీ, దూరదర్శన్ వంటి ప్రభుత్వ ఛానెల్ కానీ ఈ సీరిస్ ని టచ్ చేయకపోవటం విచిత్రమే.

చరిత్రపై అవగాహన,ప్రేమ ఉంటే తప్పించి ఇలాంటి కష్టంతో కూడుకున్న రీసెర్చ్ వర్క్  చేయలేదు. అర్జెంట్ గా కథ అనేసుకుని చుట్టేసే సినిమాను కాదు. ప్రొడక్షన్ డిజైన్ దగ్గర నుంచి అన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ రావాలి.  నిఖిల్ అద్వాని చేసిన ఈ ప్రయత్నం  కమర్షియల్ ఏ మేరకు సక్సెస్ అయ్యిందో కానీ దర్శకుడు గా , విజనరీగా ఆయన మాత్రం సక్సెస్ అని చెప్పాలి. ఇంతకీ ఈ సీరిస్ కథేంటి, మనం చూడదగ్గ కంటెంట్ ఉందా వంటి విషయాలు చూద్దాం. 

28


కథేంటి

1944 నుంచి 1947 మధ్య జరిగే చరిత్ర ఇది. భారతదేశ  స్వాతంత్య్ర పోరాటం ముమ్మరంగా జరుగుతున్న సమయం అది. రేపో, మాపో  స్వాతంత్య్రం వచ్చేస్తుందని అందరికీ తెలుసు. ఆ సమయంలో  దేశ స్వాతంత్ర్యం కోసం జరిగే కీలకమైన నిర్ణయం తీసుకోడానికి రెండు పార్టీలు సమావేశం అవుతాయి. సిమ్లాలోని వైస్ రాయ్ వేవెల్ లో కొంతమంది కాంగ్రెస్ లీడర్స్, ముస్లిం లీగ్  లీడర్స్ చర్చల కోసం కలుస్తారు.

రెండు పార్టీల నాయకులు ఒకే నిర్ణయానికి రావాలనుకుంటారు. ఆ మీటింగ్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ , చాచా నెహ్రూ, మహాత్మాగాంధీ, మహమ్మద్ అలీ జిన్నా ముఖ్యమైన నాయకులుగా పాల్గొంటారు. అయితే ఈ సమావేశంలో గాంధీ తీసుకున్న నిర్ణయం అంతా మార్చేస్తుంది? ఈ క్రమంలోపాకిస్తాన్ విడిపోవడానికి అసలు కారణమేంటి? పంజాబ్ లోని జరిగిన అల్లర్ల వెనక గల కారణమేంటో తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

38


ఎలా ఉందంటే..

డైరక్టర్ గా నిఖిల్ అద్వానీ చాలా పాపులర్. హిట్, ఫ్లాఫ్ లకు అతీతంగా ఆయన కంటిన్యూగా సినిమాలు తీస్తూనే ఉంటారు. ఆయన తొలిచిత్రం షారూఖ్ తో తీసిన కల్ హో నా హో నవంబర్ 15 2024న రిలీజైంది. ఆ బ్లాక్ బస్టర్ రొమాంటిక్ కామెడీ రిలీజైన ఇరవై ఏళ్లతర్వాత అదే రోజున ఈ వెబ్ సీరిస్ రిలీజైంది. ఈ ఇరవై ఏళ్లలో నిఖిల్ అద్వాని రొమాంటిక్ కామెడీ ల నుంచి హిస్టారికల్ డ్రామా లు తీసే స్దాయికి వచ్చారు. ఈ సీరిస్ ఓ పొలిటికల్ థ్రిల్లర్ గా కనిపిస్తుంది. మన దేశ స్వాతంత్ర్య కాలం నాటి అనేక విషయాలను స్పృశిస్తుంది. అప్పటి జీవితాలను,  సమస్యలను, దేశభక్తిని, స్వాతంత్ర్య ఆకాంక్షను మన ముందుకు ఉంచుతుంది. 

48
Nikkhil Advani, Freedom at Midnight, Ott review

Nikkhil Advani, Freedom at Midnight, Ott review


దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్ని కీలక నాయకులను, కీలక సంఘటనలను ఈ సీరిస్ మన ముందు మొహమాటం లేకుండా ఉంచుతుంది.   ఈ సీరిస్ లో కొన్ని ఎపిసోడ్స్ ..మతపరమైన వైరుధ్యాలనే కాకుండా ఐడియాలజీ కాంప్లిక్ట్స్ ని చూపుతుంది.

పవర్ డైనమిక్స్ మారటం, ప్రజల భావోద్వేగాలు, రక్తపాతంతో పరిస్దితులు మారటం వంటివి చోటు చేసుకున్నాయి.  అయితే మనకు నచ్చే అంశం ఏమిటంటే.. అన్ని క్రాఫ్ట్ లు ఫెరఫెక్ట్ గా పనిచేసిన పొలిటికల్ థ్రిల్లర్ కావటం ఆసక్తి కలిగిస్తుంది. మొదటి సీన్ నుంచే మనని హుక్ చేయటం మొదలెడుతుంది. అయితే ఇది నవల ఆధారంగా తీసిందే. పూర్తి నిజం కాదు. ఊహ అనే విషయం అర్దం చేసుకునే దిశగా మరింత వివరణ ఇచ్చి ఉండాల్సిందేమో. 
 

58
Nikkhil Advani, Freedom at Midnight, Ott review

Nikkhil Advani, Freedom at Midnight, Ott review

టెక్నికల్ గా...

యాక్టింగ్, డైరక్షన్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సెట్ డిజైన్ అన్ని ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయి. అయితే స్లో నేరేషన్ ఇబ్బందికి గురి చేస్తుంది. అప్పటికీ ప్రతీ ఎపిసోడ్ ఆర్క్ సరిగ్గా ఉండేలా స్క్రిప్టు డిజైన్ చేసుకున్నారు.  స్టోరీ స్క్రీన్ ప్లే విషయానికి చాలా సింపుల్ గా ఉంది. కన్ఫూజ్ చేసే అంశాలను కావాలనే వదిలేసినట్లున్నారు. భారీ విజన్, విషయాలపై స్పష్టత ఈ సీరిస్ కు పెట్టని కోట. మనకు చరిత్ర తెలుసుకోవాలని ఏ మాత్రం ఆసక్తి ఉన్నా ఈ సీరిస్ మనని ఎంగేజ్ చేస్తుందనటంలో సందేహం లేదు. అయితే ప్రధాన నాయకులుకు మేకప్ ఇంకాస్త బాగుండాలనిపిస్తుంది.  
 

68
Nikkhil Advani, Freedom at Midnight, Ott review

Nikkhil Advani, Freedom at Midnight, Ott review


నటీనటుల్లో జవహార్ లాల్ నెహ్రూగా సిద్దాంత్ గుప్తా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గా రాజేంద్ర చావ్లా, మహాత్మా గాంధీ పాత్రలో చిరాగ్ వోహ్రా ఆకట్టుకున్నారు. ఇక మిగతా పాత్రలు వారి పరిధి మేరకు నటించారు.

78
Nikkhil Advani, Freedom at Midnight, Ott review

Nikkhil Advani, Freedom at Midnight, Ott review

చూడచ్చా

స్వాతంత్య్రం వ‌చ్చిన స‌మ‌యంలో దేశంలో ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకున్నాయ‌న్న‌ది క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపిన  ఈ వెబ్‌సిరీస్‌ ఇంట్రస్టింగ్ గానే ఉంది. అయితే అదే సమయంలో ఇదో హిస్టారిక్ ఫిక్షన్ అని గుర్తించుకోవాలి. ఇదే నిజం కాదు అని గుర్తు పెట్టుకోవాలి. ఏడు ఎపిసోడ్స్ లో ఈ సీరిస్ సాగుతుంది .. 
--- సూర్య ప్రకాష్ జోశ్యుల
 

88
Nikkhil Advani, Freedom at Midnight, Ott review

Nikkhil Advani, Freedom at Midnight, Ott review

తెర వెనక..ముందు

నటీనటులు:  సిద్దాంత్ గుప్తా, రాజేంద్ర చావ్లా , చిరాగ్ వోహ్రా, ల్యూక్ మెక్ గిబ్నీ, అరిఫ్ జాకారియా తదితరులు
ఎడిటింగ్: శ్వేతా వెంకట్
సినిమాటోగ్రఫీ: మలయ్ ప్రకాశ్
మ్యూజిక్: అషుతోష్ పాఠక్
నిర్మాతలు: మోనిషా అద్వానీ, మధు బోజ్వానీ
దర్శకత్వం: నిఖిల్ అద్వానీ 
ఓటీటీ: సోని లివ్

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: ఒకే రాత్రి 3 హ‌త్య‌లు, ఊహ‌కంద‌ని ట్విస్టులు, ప్ర‌తీ సీన్ క్లైమాక్సే.. ఓటీటీలో సూప‌ర్ థ్రిల్ల‌ర్
Recommended image2
బాలయ్య దగ్గర రికమండేషన్ లెటర్ తీసుకున్నా, ఎక్కడ తిరిగినా అడగొద్దు అని నా భర్తకు చెప్పా.. నటి హేమ కామెంట్స్
Recommended image3
దసరా బుల్లోడు రివ్యూ, వాణిశ్రీ తో ఏఎన్నార్ మోటు సరసం, రొమాంటిక్ సాంగ్స్ తో రెచ్చిపోయిన అక్కినేని..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved