ఆపిల్ ఐఫోన్ దారిలో శామ్‌సంగ్.. ఈ ఫోన్ బాక్సులో ఇక ఛార్జర్ లభించదు..!
శామ్‌సంగ్ కూడా ఆపిల్ మార్గాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తుంది. ఒక నివేదిక ప్రకారం శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు కొన్ని దేశాలలో ఛార్జర్ లేకుండా విక్రయిస్తుంది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం ఐఫోన్ తాజాగా ఐఫోన్ 12 లాంచ్ చేసిన సంగతి మీకు తెలిసిందే. అయితే కరోనా సంక్షోభం కారణంగా ఐఫోన్ 12 సిరీస్‌లతో ఛార్జర్లు, ఇయర్‌ఫోన్‌లను అందించకూడదని ఆపిల్ నిర్ణయించుకుంది.
ఆ సమయంలో షియోమి, వన్‌ప్లస్, శామ్‌సంగ్ వంటి పెద్ద కంపెనీలు ఆపిల్‌ను ఎగతాళి చేశాయి, కానీ ఇప్పుడు ఒక నెల తరువాత, శామ్‌సంగ్ కూడా ఆపిల్ మార్గాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తుంది. ఒక నివేదిక ప్రకారం శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 21 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు కొన్ని దేశాలలో ఛార్జర్ లేకుండా విక్రయిస్తుంది.
ఎక్స్‌డా డెవలపర్‌ల నివేదిక ప్రకారం బ్రెజిల్‌లో గెలాక్సీ ఎస్ 21 సేల్స్ ఇప్పుడు ఛార్జర్ లేకుండానే అందిస్తుంది, అయినప్పటికీ దీనిపై శామ్‌సంగ్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఆపిల్ తరువాత ఫోన్ బాక్స్ లో ఛార్జర్‌ను అందించకుండ ఫోన్ లను విక్రయిస్తున్నా రెండవ సంస్థ శామ్‌సంగ్ కావడం విశేషం.
also read అద్భుతమైన క్యూఎల్‌ఈడీ డిస్‌ప్లేతో షియోమి కొత్త 4కే టివి లాంచ్.. ధర, ఫీచర్స్ తేలుసా ? ...
అంతకుముందు శామ్సంగ్ ఫేస్ బుక్ పేజీలో ఛార్జర్ లేకుండా ఐఫోన్ విక్రయించడంపై ఎగతాళి చేస్తూ పోస్ట్ చేసింది. అయితే తరువాత పోస్ట్ పేజీ నుండి వెతనే తొలగించింది. శామ్‌సంగ్ ఆపిల్‌ను ఎగతాళి చేయడం ఇదేం మొదటిసారి కాదు.
ఆపిల్ ఐఫోన్‌తో హెడ్‌ఫోన్ జాక్ ఇవ్వడం ఆపివేసినప్పుడు కూడా, శామ్‌సంగ్ ఆపిల్‌ను ఎగతాళి చేసింది. ఆ తర్వాత శామ్‌సంగ్ కూడా హెడ్‌ఫోన్ జాక్ లేకుండా గెలాక్సీ నోట్ 10 సిరీస్‌ను విడుదల చేసింది. ఇప్పుడు గెలాక్సీ ఎస్ 21ను ఛార్జర్ లేకుండా బ్రెజిల్‌లో , అయితే విక్రయిస్తున్నట్లు కొన్ని నివేదికలు తెలిపాయి.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 21 ను ఛార్జర్ లేకుండా ఇతర దేశాలలో విక్రయిస్తుందా లేదా అనే దాని పై ఇంకా స్పష్టంగా సమాచారం లేదు. విశేషమేమిటంటే ఇటీవల ఫ్రాన్స్ తరువాత బ్రెజిల్‌లో ఆపిల్ ఐఫోన్ 12, ఇతర సిరీస్‌లతో పాటు బాక్స్‌లో ఛార్జర్‌లను ఆపిల్ అందించవల్సి వచ్చినట్టు సమాచారం.