టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో న్యూ ఇయర్ కి స్వాగతం పలకనున్నారు. ఆస్ట్రేలియా టీంతో టెస్టు సిరీస్ లో భాగంగా కోహ్లీ ఆస్ట్రేలియా వెళ్లిన సంగతి తెలిసిందే. మెల్ బోర్న్ లో ఆసిస్ తో జరిగిన మూడో టెస్టులో భారత్ విజయం సాధించింది. అంతేకాదు..బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా చివరిదైనా నాలుగో టెస్ట్ సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో కోహ్లీ..ఆసిస్ పర్యటన ఇంకా ముగియలేదు.

దీంతో.. ఆస్ట్రేలియాలోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాల్సి వస్తోంది. ఇక అనుష్క శర్మ విషయానికి వస్తే.. ఆమె నటించిన జీరో సినిమా ఇటీవల విడుదలైంది. మూవీ ప్రమోషన్స్ కూడా లేకపోవడంతో.. ఆమె.. భర్త కోసం ఆస్ట్రేలియాలో వాలిపోయింది. దీంతో.. ఇద్దరూ సిడ్నీలో తమ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోనున్నారు.

ఈ విషయాన్ని కోహ్లీ.. ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. అనుష్కతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి.. ఈ విషయాన్ని కోహ్లీ వెల్లడించాడు.