క్రికెట్ లవర్స్ మీకు మరో గుడ్ న్యూస్.. T20 World Cup 2024 షెడ్యూల్ వచ్చేసింది.. !
Women’s T20 World Cup 2024 schedule : మహిళల టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్ విడుదలైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్ తో పాటు భారత్ కూడా గ్రూప్-ఏ ఉంది.
Women’s T20 World Cup 2024 schedule: క్రికెట్ లవర్స్ కు మరో గుడ్ న్యూస్.. ఐపీఎల్ ముగియగానే పరుషుల టీ20 ప్రపంచ కప్ 2024 జారత మొదలకానుంది. ఇది ముగిసిన వెంటనే మరో మెగా టోర్నమెంట్ ను నిర్వహించడానికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సిద్దమవుతోంది. దీనికి సంబంధించి షెడ్యూల్ ను కూడా తాజాగా విడుదల చేసింది. అదే మహిళల టీ20 ప్రపంచ కప్ 2024. బంగ్లాదేశ్‌లో అక్టోబర్ 3 నుంచి 20 మధ్య జరగనున్న రాబోయే మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 కోసం ఐసీసీ పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది.
మహిళల క్రికెట్ టీ20 ప్రపంచ కప్ తొమ్మిదో ఎడిషన్ టోర్నమెంట్‌లో 10 జట్లు పాల్గొననున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. మొత్తం 23 మ్యాచ్‌లు జరగనున్నాయి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్, ఐసీసీ సీఈవో జియోఫ్ అల్లార్డిస్‌లు హాజరైన ఢాకాలో జరిగిన కార్యక్రమంలో షెడ్యూల్‌ను ప్రకటించారు. భారత్, బంగ్లాదేశ్ మహిళా జట్ల కెప్టెన్లు వరుసగా హర్మన్‌ప్రీత్ కౌర్, నిగర్ సుల్తానా కూడా హాజరయ్యారు.
డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో కలిసి భారత్ టోర్నమెంట్‌లో గ్రూప్-ఏలో ఉంది. అలాగే, నాలుగు జట్లు పోటీగా ఉన్న క్వాలిఫైయర్ 1 జట్టు కూడా ఇదే గ్రూప్ లో చేరుతుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు తమ అన్ని మ్యాచ్‌లను సిల్హెట్‌లో ఆడనుంది. భారత్ అక్టోబర్ 4న న్యూజిలాండ్ తో తన తొలి మ్యాచ్ ను ఆడనుంది. రెండు రోజుల తర్వాత అంటే అక్టోబర్ 6న క్వాలిఫైయర్‌తో, అక్టోబర్ 9న చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌తో తలపడుతుంది. భారత్ తమ గ్రూప్-స్టేజ్ ను బలమైన జట్టుగా ఉన్న ఆస్ట్రేలియా మ్యాచ్ అక్టోబర్ 13న ముగించనుంది. అక్టోబరు 20న ఢాకాలో జరిగే ఫైనల్‌కు ముందు అక్టోబర్ 17, 18 తేదీల్లో జరిగే సెమీఫైనల్స్‌కు మొదటి రెండు జట్లు వెళ్లడానికి ముందు ప్రతి జట్టు టోర్నమెంట్‌లో నాలుగు గ్రూప్ మ్యాచ్ లను ఆడనుంది.
భారత మహిళల టీT20 ప్రపంచ కప్ 2024: పూర్తి షెడ్యూల్
4 అక్టోబర్ 2024: భారత్ v న్యూజిలాండ్, సిల్హెట్, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలు.
6 అక్టోబర్ 2024: భారత్ v పాకిస్తాన్, సిల్హెట్, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలు.
9 అక్టోబర్ 2024: భారత్ v క్వాలిఫైయర్ 1, సిల్హెట్, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలు.
13 అక్టోబర్ 2024: భారత్ v ఆస్ట్రేలియా, సిల్హెట్, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలు.
మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 పూర్తి షెడ్యూల్:
అక్టోబర్ 3: ఇంగ్లండ్ v సౌతాఫ్రికా, ఢాకా
అక్టోబర్ 3: బంగ్లాదేశ్ v క్వాలిఫైయర్ 2, ఢాకా
అక్టోబర్ 4: ఆస్ట్రేలియా v క్వాలిఫైయర్ 1, సిల్హెట్
అక్టోబర్ 4: భారత్ v న్యూజిలాండ్, సిల్హెట్
అక్టోబర్ 5: దక్షిణాఫ్రికా v వెస్టిండీస్, ఢాకా
అక్టోబర్ 5: బంగ్లాదేశ్ v ఇంగ్లాండ్, ఢాకా
అక్టోబర్ 6: న్యూజిలాండ్ v క్వాలిఫైయర్ 1, సిల్హెట్
అక్టోబర్ 6: భారత్ v పాకిస్థాన్, సిల్హెట్
అక్టోబర్ 7: వెస్టిండీస్ v క్వాలిఫైయర్ 2, ఢాకా
అక్టోబర్ 8: ఆస్ట్రేలియా v పాకిస్తాన్, సిల్హెట్
అక్టోబర్ 9: బంగ్లాదేశ్ v వెస్టిండీస్, ఢాకా
అక్టోబర్ 9: భారత్ v క్వాలిఫైయర్ 1, సిల్హెట్
అక్టోబర్ 10: దక్షిణాఫ్రికా v క్వాలిఫైయర్ 2, ఢాకా
అక్టోబర్ 11: ఆస్ట్రేలియా v న్యూజిలాండ్, సిల్హెట్
అక్టోబర్ 11: పాకిస్థాన్ v క్వాలిఫైయర్ 1, సిల్హెట్
అక్టోబర్ 12: ఇంగ్లండ్ v వెస్టిండీస్, ఢాకా
అక్టోబర్ 12: బంగ్లాదేశ్ v సౌతాఫ్రికా, ఢాకా
అక్టోబర్ 13: పాకిస్థాన్ v న్యూజిలాండ్, సిల్హెట్
అక్టోబర్ 13: భారత్ v ఆస్ట్రేలియా, సిల్హెట్
అక్టోబర్ 14: ఇంగ్లండ్ v క్వాలిఫైయర్ 2, ఢాకా
అక్టోబర్ 17: మొదటి సెమీ-ఫైనల్, సిల్హెట్
అక్టోబర్ 18: రెండవ సెమీ-ఫైనల్, ఢాకా
అక్టోబర్ 20: ఫైనల్, ఢాకా
టీ20 ప్రపంచకప్‌పై దాడిచేస్తాం.. పాకిస్థాన్ ఉగ్రవాదుల బెదిరింపులు
- BCCI
- Bangladesh
- Cricket
- Cricket Lovers
- Harmanpreet Kaur
- ICC
- ICC Womens T20 World Cup 2024
- ICC Womens T20 World Cup 2024 Fixture
- ICC Womens T20 World Cup 2024 Fixture Schedule announced
- ICC Womens T20 World Cup 2024 Schedule
- IPL 2024
- Indian Womens Cricket Team
- Sports
- T20 World Cup 2024
- Tata IPL 2024
- Womens Cricket
- Womens T20 World Cup 2024