వెస్టిండిస్‌తో స్వదేశంలో జరుగుతున్న ఐదు వన్డే సీరిస్‌లో ఇప్పటికే రెండు వన్డేలు ముగిసిన విషయం తెలిసిందే. ఇందులో భారత జట్టు ఓ విజయాన్ని సాధించగా వైజాగ్ లో జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. అయితే మిగతా మూడు వన్డేల కోసం గత గురువారం సెలెక్టర్లు భారత జట్టును ఎంపిక చేశారు. ఇందులో చోటు దక్కుతుందని  ఆశించి భంగపడ్డ భారత ఆటగాడు కేదార్ జాదవ్ సెలెక్టర్ల తీరుపై బహిరంగంగానే విమర్శలకు దిగాడు. ఊహించని ఈ పరిణామంతో ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ డైలమాలో పడింది.

మిడిల్ ఆర్డర్ బ్యాట్ మెన్ కేదార్ జాదవ్ విమర్శలతో సెలెక్షన్ కమిటీ దిగివచ్చింది. ముందుగా జాదవ్ ను నచ్చజెప్పడానికి ప్రయత్నించి సెలెక్టర్లు విఫలమయ్యారు. దీంతో చేసేదేమీలేక చివరకు చివరి  రెండు వన్డేల్లో కేదార్ జాదవ్ కు స్థానం కల్పించారు. ఈ మేరకు బిసిసిఐ అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 

గతంలో ఫిట్‌గా లేనంటూ జట్టులో ఎంపిక చేయకపోవడంతో చాలా కష్టపడి ఫిట్ నెస్ సాధించానని కేదార్ జాదవ్ తెలిపాడు. అలాంటిది తనకు కనీస సమాచారం లేకుండా మళ్లీ భారత జట్టులో ఎంపిక చేయకపోవడం ఏంటని అతడు ప్రశ్నించాడు. ఇతడు బహిరంగంగా విమర్శలకు దిగడంతో స్పందించిన సెలెక్షన్ కమిటీ చివరకు చివరి రెండు వన్డేల్లో చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ వ్యవహారంపై చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ...జాదవ్ తరచూ గాయాలపాలవడం వల్లే మొదట అతన్ని ఎంపిక చేయతేదని అన్నారు. అతని పిట్‌నెస్ పై ఓ అంచనాకు రాకపోవడం వల్లే ఈ నిర్నయం  తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ వ్యవహారంలో దుమారం రేగుతుండటంతో మళ్లీ అతన్ని సెలెక్ట్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.

 

మరిన్ని వార్తలు

మిగతా మూడు వన్డేల నుండి షమీ ఔట్....వారిద్దరు ఇన్....

విశాఖ పిచ్‌పై పూజలు... చీఫ్ సెలెక్టర్‌ ఎమ్మెస్కేపై విమర్శలు

వైజాగ్ వన్డేలో సచిన్ రికార్డును బద్దలుగొట్టిన కోహ్లీ

విశాఖ వన్డే టై: హోప్ అద్భుతమైన బ్యాటింగ్

ధోనీ, కోహ్లీ, రోహిత్‌లను నిలబెట్టిన ‘‘విశాఖ’’

ధోనీ లా ఒకరోజు గడపాలని ఉంది.. పాక్ మహిళా క్రికెటర్ సనామీర్

రోహిత్ మరో సిక్స్ కొడితే సచిన్ రికార్డు బద్దలు....

''వీల్‌చైర్లో ఉన్నా ధోనిని బరిలోకి దించుతా''