భారత్, వెస్టిండీస్ మధ్య విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డే మ్యాచ్ ఉత్కంఠగా సాగి టైగా ముగిసింది. హోప్ అద్భుతమైన బ్యాటింగ్ ద్వారా వెస్టిండీస్ లో ఆశలు రేపుతూ వచ్చాడు. చివరి బంతికి విజయానికి ఐదు పరుగులు కావాల్సి ఉండగా హోప్ ఫోర్ గా మలిచాడు. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. 134 బంతుల్లో హోప్ 123 పరుగులు చేశాడు. హెట్ మియర్ 94 పరుగులు చేసి అవుటైన తర్వాత ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ హోప్ పరుగులు తీస్తూ గోడలా నిలబడ్డాడు. వెస్టిండీస్ ఏడు వికెట్లు నష్టపోయి 321 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీశాడు.మొహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, చాహల్ తలో వికెట్ తీసుకున్నారు.  

అంతకు ముందు మ్యాచులో తీవ్ర ఉత్కంఠ చోటు చేసుకుంది. హోప్ అద్భుతమైన తన బ్యాటింగ్ ద్వారా సెంచరీ చేసి, వెస్టిండీస్ ను విజయానికి చేరువగా తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. 253 పరుగుల స్కోరు వద్ద పావెల్ రూపంలో వెస్టిండీస్ ఐదో వికెట్ కోల్పోయింది. స్కోరు 300 పరుగులు ఉన్న సమయంలో హోల్డర్ రన్నవుట్ కావడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. నర్స్ ఔట్ కావడంతో వెస్టిండీస్ ఆశలు సన్నగిల్లాయి. ఏడో వికెట్ గా వెనుదిరిగాడు. ఈ స్థితిలో విండీస్ విజయానికి రెండు బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన స్థితిలో పడింది.

రెండో వన్డేలో తన అద్భుత బ్యాటింగ్ తో మరోసారి ఆదుకునే ప్రయత్నం చేసిన హెట్మెయర్ సెంచరీకి ముందు చతికిలపడ్డాడు. 94 పరగుల వద్ద చాహల్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి కోహ్లీకి క్యాచిచ్చి ఔటయ్యాడు. దీంతో నాలుగో వికెట్ బాగస్వామ్యాని తెరపడింది. 

వైజాగ్ వన్డేలో విండీస్ బ్యాట్ మెన్స్ హోఫ్స్, హెట్మెయర్ చెలరేగి ఆడారు. 78 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జట్టును మరో వికెట్ పడకుండా 212 పరుగుల వరకు తీసుకెళ్లారు. అప్ప్టటికి ఇద్దరు అర్థశతరాలను పూర్తిచేసుకున్నారు. వీరి ధనాధన్ బ్యాటింగ్ తో కేవలం 31 ఓవర్లకే విండీస్ 218 పరుగులు చేసింది.

322 పరుగుల లక్ష్యచేదనలో విండీస్ బ్యాట్ మెన్స్ తొలుత తడబడ్డారు. దీంతో కేవలం 78 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్ 2 , షమీ ఓ వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం విండీస్ జట్టు 15 ఓవర్లలో 100 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. క్రీజులో హోప్స్, హెట్మెయర్ ఉన్నారు. 

భారత్ నిర్దేశించిన 322 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన విండీస్ ఓపెనర్లు 64 పరుగులకే పెవిలియన్ బాటపట్టారు.  మొదట 36 పరుగుల వద్ద పావెల్ ఔటవగా, 64 పరుగుల  వద్ద  మరో ఓపెనర్ హేమరాజ్ ఔటయ్యాడు.  322 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన విండిస్ జట్టుకు ఆదిలోనే భారత బౌలర్లు షాకిచ్చారు. ఓపెనర్  పావెల్ ను మహ్మద్ షమీ ఔట్ చేశాడు. దీంతో ఆరు ఓవర్లలోనే విండీస్ 36 పరుగులు వికెట్ కోల్పోయింది. 

రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత బ్యాట్ మెన్స్ మరోసారి అధ్భుతంగా బ్యాటింగ్ చేశారు. దీంతో భారత్ కేవలం ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి 321 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి సెంచరీ సాధించాడు. మొత్తంగా కోహ్లీ 157 పరుగులను కేవలం 129 బంతుల్లోనే సాధించి నాటౌట్ గా నిలిచాడు.

ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు తొందరగానే ఔటైనా కోహ్లీ, రాయుడు జోడీ వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూ మొదట  ఆచితూచి బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్థ శతకాలు నమోదు చేసుకున్నారు. అనంతరం రాయుడు 73  పరగుల వద్ద ఔటవడంతో ఈ బాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన ధోనీ, రిషబ్ పంత్, జడేజా లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా కోహ్లీ జోరు మాత్రం తగ్గలేదు. మొత్తంగా కోహ్లీ చెలరేగి సెంచరీ సాధించి చివరివరకు నిలవడంతో విండీస్‌కు భారత్ 322 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించగలిగింది.

టీంఇండియా రన్ మెషిన్, కెప్టెన్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. ఇప్పటికే అతి తక్కువ ఇన్నింగ్సుల్లో, అత్యంత వేగంగా 10 వేలపరుగులు పూర్తి రికార్డులను బద్దలుకొట్టిన విషయం తెలిసిందే. దీంతో వన్డే కెరిర్లో 37వసెంచరీని పూర్తిచేసుకున్నాడు. మొత్తంగా తన కెరీర్లో 61వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. వరుస ఇన్నింగ్సుల్లో సెంచరీలు చేయడం కోహ్లీకిది 7వ సారి కావడం విశేషం. 

భారత్ 179 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. విరాట్ కోహ్లీతో కలిసి నిలకడగా ఆడిన అంబటి రాయుడు 73 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరుకున్నాడు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ మరోసారి భారత క్రికెట్ అభిమానులను నిరాశపరిచాడు. కేవలం 20 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో భారత్ 40.2 ఓవర్లలో 222 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

కోహ్లీ వెస్టిండిస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 50 పరుగులను 59 బంతుల్లో సాధించాడు. ఇలా కోహ్లీ తన కేరీర్ లో 49 వ అర్థశతకాన్ని నమోదు చేసుకున్నాడు.ఇతడికి తోడుగా అంబటి రాయుడు కూడా నిలకడగా ఆడుతూ అర్థశతకం నమోదు చేసుకున్నాడు.  రాయుడు 54 పరుగులు 63 బంతుల్లో చేశాడు. భారరత్ 27 ఓవర్లలో 142 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది.

తొలి వన్డేలో ఘన విజయం సాధించి ఊపు మీదున్న ఇండియా తన జట్టులో ఓ మార్పు చేసింది. తుది జట్టులోకి కుల్దీప్ యాదవ్ స్థానంలో ఖలీల్ అహ్మద్ ను తీసుకుంది. వెస్టిండీస్ జట్టులో కూడా ఓ మార్పు జరిగింది.

ఓబెండ్ మెకోయ్ అంతర్జాతీయ వన్డేలో ఆరంగేట్రం చేశాడు. ఓషానే థామస్ స్థానంలో అతను తుది జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం భారత్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. కోహ్లీ 12పరుగులతోనూ, రాయుడు 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.