టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. తన అభిమాన ఇండియన్ క్రికెటర్ అని పాక్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ సనామీర్ తెలిపారు.  సనామీర్.. ఇటీవల వాయిస్ ఆఫ్ క్రికెట్ షో కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా.. ఆ షోలో క్రికెట్ గురించి పలు విషయాలను ఆమె వెల్లడించారు.

దీనిలో భాగంగానే యాంకర్.. సనామీర్ ని రాబిట్ ఫైర్ లో కొన్ని ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానంగా ధోనీ తన ఫేవరేట్ ఇండియన్ క్రికెటర్ అని తెలిపింది. ‘‘ఒకరోజంతా నువ్వు ఏ క్రికెటర్ లా అయినా ఉండాలనుకంటే ఎవరిలా ఉంటావు  ’’ యాంకర్ ప్నశ్నించగా.. టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పేర్లను ఆమె తెలిపారు.