టీమిండియాలోని చాలామంది క్రికెటర్లకు వారి వారి స్వస్థలాలతో పాటు ఇతర క్రికెట్ మైదానాలు ఎంతో ప్రత్యేకమైనవి.. ఆయా గ్రౌండ్లలో చేసిన ప్రదర్శన కారణంగానే వారు కెరీర్‌లో నిలదొక్కుకున్నారు. అలాంటి స్టేడియాల్లో ఒకటి విశాఖలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ మైదానం..

ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ముగ్గురు మేటీ ఆటగాళ్లు ధోనీ, కోహ్లీ, రోహిత్‌లు ఈ స్థాయికి రావడం వెనుక వారు గతంలో వైజాగ్‌లో చేసిన అద్బుత ప్రదర్శనే కారణం. ధోనీ విషయానికి వస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో మహేంద్రుడి ప్రస్థానం విశాఖ నుంచే మొదలైందని చెప్పవచ్చు.

2005లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ధోనీ 148 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఈ విధ్వంసకర బ్యాటింగ్‌తోనే మహేంద్రుడు భారత క్రికెట్‌లో తన శకాన్ని ప్రారంభించాడు.

2010లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో నేటి కెప్టెన్, అప్పటి జట్టు సభ్యుడు విరాట్ కోహ్లీ చెలరేగి ఆడి 118 పరుగులు చేశాడు.. ఇదే స్టేడియంలో 2011లో విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 117 పరుగులు కొట్టాడు. ఆ తర్వాత 2016 అక్టోబర్ 29న భారత్-న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 65 పరుగులు చేశాడు. ఈ వన్డేలో భారత్ 190 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

ఇక డాషింగ్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు విశాఖ స్టేడియం బాగా కలిసొచ్చింది.. 2011లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 90 పరుగులు చేసిన రోహిత్ శర్మ... 2016లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 90 పరుగులు చేశాడు. అలా మాజీ కెప్టెన్, కెప్టెన్, వైస్ కెప్టెన్‌లకు ఫేవరేట్ గ్రౌండ్ కావడంతో వారు ముగ్గురు ఇవాళ కూడా చెలరేగుతారని విశాఖ వాసులు భావిస్తున్నారు. 

కోహ్లీ అసలు మనిషేనా.. బంగ్లా క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ధోనీ లా ఒకరోజు గడపాలని ఉంది.. పాక్ మహిళా క్రికెటర్ సనామీర్

రోహిత్ మరో సిక్స్ కొడితే సచిన్ రికార్డు బద్దలు....

''వీల్‌చైర్లో ఉన్నా ధోనిని బరిలోకి దించుతా''

సచిన్ రికార్డును బద్దలుకొట్టిన రోహిత్ శర్మ...క్రికెట్ చరిత్రలో ఒకేఒక్కడు

మరో రికార్డ్ సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ

వెస్టిండీస్ పై వన్డే: షమీ చెత్త రికార్డు

కోహ్లీకి షాకిచ్చిన బీసీసీఐ