Asianet News TeluguAsianet News Telugu

మిగతా మూడు వన్డేల నుండి షమీ ఔట్....వారిద్దరు ఇన్....

వెస్టిండిస్ జట్టుతో జరగనున్న మిగతా మూడు వన్డేల్లో బరిలోకి దిగనున్న భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించారు.  వైజాగ్ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని భారత  జట్టులో పలు కీలక మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. 321 పరుగులను కాపాడుకోవడంలో బౌలింగ్ విభాగం విఫలమైందని భావించిన సెలెక్టర్లు ముఖ్యంగా బౌలర్ల ఎంపికపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
 

Bumrah, Bhuvi back, Shami dropped for last 3 ODIs
Author
New Delhi, First Published Oct 25, 2018, 6:06 PM IST

వెస్టిండిస్ జట్టుతో జరగనున్న మిగతా మూడు వన్డేల్లో బరిలోకి దిగనున్న భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించారు.  వైజాగ్ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని భారత జట్టులో పలు కీలక మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. 321 పరుగులను కాపాడుకోవడంలో బౌలింగ్ విభాగం విఫలమైందని భావించిన సెలెక్టర్లు ముఖ్యంగా బౌలర్ల ఎంపికపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

వన్డే సీరిస్ లో భాగంగా జరిగిన గౌహతి, వైజాగ్ వన్డేల్లో అంతగా ఆకట్టుకోలేకపోయిన మహ్మద్ షమీపై వేటు పడింది. అతడిని మిగతా మూడు వన్డేల నుండి తొలగించిన మేనేజ్ మెంట్ మొదటి రెండు వన్డేలకు దూరమైన స్టార్ బౌలర్ల జస్ప్రీత్ సింగ్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ లకు చోటు కల్పించారు. ఇవాళ 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును సెలెక్టర్లు ప్రకటించగా...ఈ మార్పులు కనిపించాయి. 

ఇప్పటికే ఐదు వన్డేల సీరిస్ లో భారత్ ఓ వన్డేలో గెలవగా మరో వన్డే టైగా ముగిసింది. ఆలా వెస్టిండిస్ పై భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో వన్డేలో బ్యాటింగ్ పరంగా విండీస్ పుంజుకున్న విషయాన్ని గ్రహించిన సెలక్టర్లు ఈ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 27, 29 మరియు నవంబర్ 1 తేదీల్లో మిగతా మూడు వన్డేలు జరగననున్నాయి. 

గురువారం ప్రకటించిన బారత జట్టులోని  ఆటగాళ్లు వీరే...

విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, అంబటి రాయుడు, రిషబ్‌ పంత్‌, మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, యజువేంద్ర ఛాహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్ సింగ్ బూమ్రా, ఖలీల్‌ అహ్మద్‌, ఉమేశ్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌, మనీష్‌ పాండే

మరిన్ని వార్తలు

విశాఖ పిచ్‌పై పూజలు... చీఫ్ సెలెక్టర్‌ ఎమ్మెస్కేపై విమర్శలు

వైజాగ్ వన్డేలో సచిన్ రికార్డును బద్దలుగొట్టిన కోహ్లీ

విశాఖ వన్డే టై: హోప్ అద్భుతమైన బ్యాటింగ్

ధోనీ, కోహ్లీ, రోహిత్‌లను నిలబెట్టిన ‘‘విశాఖ’’

ధోనీ లా ఒకరోజు గడపాలని ఉంది.. పాక్ మహిళా క్రికెటర్ సనామీర్

రోహిత్ మరో సిక్స్ కొడితే సచిన్ రికార్డు బద్దలు....

''వీల్‌చైర్లో ఉన్నా ధోనిని బరిలోకి దించుతా''

Follow Us:
Download App:
  • android
  • ios