వైజాగ్ లో వెస్టిండిస్ తో జరుగుతున్న  రెండో వన్డేలో టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి రెచ్చిపోయాడు. ఇప్పటికే హాప్ సెంచరీని పూర్తి చేసిన కోహ్లీ సెంచరీ వైపు అడుగులేస్తున్నాడు. ఈ క్రమంలో వరల్డ్ క్రికెట్లో చాలా తక్కువ మంది క్రికెటర్లకు సాధ్యమైన ఓ అరుదైన రికార్డును నెలకోల్పాడు కోహ్లీ.

అంతర్జాతీయ  కెరీర్లో అత్యంత వేగంగా 10వేల పరుగులు సాధించిన క్రికెటర్ గా కోహ్లీ నిలిచాడు. 10 వేల పరుగుల క్లబ్ లో చేరడానికి కోహ్లీకి  కేవలం 205 ఇన్నింగ్సులు ఆడాల్సి వచ్చింది. దీంతో భారత్ తరపున అతి తక్కువ ఇన్నింగ్సుల్లో 10 వేల పరుగులు పూర్తి చేసిన సచిన్  (259 ఇన్నింగ్స్) రికార్డును కోహ్లీ బద్దలుకొట్టాడు.వైజాగ్ వన్డేలో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ సెంచరీ వైపు అడుగులేస్తూ 81 పరుగుల మార్క్ దగ్గర పది వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్ లో 10 వేల పరుగులు చేసిన 13వ క్రికెటర్ గా కోహ్లీ నిలిచాడు. భారత్ తరపున అయితే పదివేల పరుగులు సాధించిన 5వ ఆటగాడిగా కోహ్లీ  నిలిచాడు.  కోహ్లి, స‌చిన్ త‌ర్వాత 263 ఇన్నింగ్సులో 10,000 ప‌రుగులు సాధించి మాజీ ఆటగాడు సౌర‌వ్ గంగూలీ మూడోస్థానంలో ఉన్నాడు. మొత్తంగా భారత్ తరపున కోహ్లితో పాటు సచిన్‌, గంగూలీ, ద్రవిడ్‌, ధోనిలు మాత్రమే 10వేల పరుగులు సాధించిన వారిలో వున్నారు.  

 

సంబంధిత వార్తలు

విశాఖ వన్డే: నిరాశపరిచిన ధోనీ, 20 పరుగులకే ఔట్