ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య రెండో వన్డేకు విశాఖ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పిచ్‌పై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పూజలు నిర్వహించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపుతున్నాయి.

ప్రధాన పిచ్‌లో మూడు వికెట్లు పెట్టి  పూజారితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెస్కేతో పాటు స్టేడియం ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగే పిచ్‌పైకి ఇతరులు ప్రవేశించడం నిషేధం.

మ్యాచ్‌కు ముందు వీటిని పరిశీలించే అవకాశం ఎవ్వరికీ ఉండదు.. అయితే మనదేశంలో కెప్టెన్‌కు ఆ అధికారం ఉంటుంది.. విదేశాల్లో అయితే కెప్టెన్లు ప్రవేశించాలన్నా కఠినమైన నిబంధనలు ఉంటాయి. అలాంటిది ఏకంగా పూజారిని తీసుకెళ్లి పూజలు నిర్వహించడం కలకలం రేపుతుంది.

అయితే సదరు వీడియోలో స్టేడియంలో సీట్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ పూజలు మ్యాచ్‌కు ముందు జరిగాయా లేదంటే.. ఉదయం జరిగాయా..? ప్రధాన పిచ్‌పై జరిగింది.. ప్రత్యేకంగా సిద్ధం చేసిన ప్రాంతంలో జరిగిందా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో దీనిపై విమర్శలు వస్తుండటంతో బీసీసీఐ ఎమ్మెస్కే ప్రసాద్‌ను వివరణ కోరే అవకాశం ఉంది. మరోవైపు ఉత్కంఠభరితంగా సాగినన మ్యాచ్ టై గా ముగిసిన సంగతి తెలిసిందే. 

వైజాగ్ వన్డేలో సచిన్ రికార్డును బద్దలుగొట్టిన కోహ్లీ

విశాఖ వన్డే టై: హోప్ అద్భుతమైన బ్యాటింగ్

ధోనీ, కోహ్లీ, రోహిత్‌లను నిలబెట్టిన ‘‘విశాఖ’’

కోహ్లీ అసలు మనిషేనా.. బంగ్లా క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ధోనీ లా ఒకరోజు గడపాలని ఉంది.. పాక్ మహిళా క్రికెటర్ సనామీర్

రోహిత్ మరో సిక్స్ కొడితే సచిన్ రికార్డు బద్దలు....