Asianet News TeluguAsianet News Telugu

రోహిత్ మరో సిక్స్ కొడితే సచిన్ రికార్డు బద్దలు....

ప్రస్తుతం టీంఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఫామ్ లో ఉన్నాడు. విధేశాల్లోనే కాదు స్వదేశంలోనూ రాణిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. ధనా  ధన్ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించడంలో రోహిత్ ముందుటాడు. మొన్న ఆసియా కప్ లో అదరగొట్టే ప్రదర్శన చేసిన రోహిత్  ప్రస్తుతం వెస్టిండిస్ తో జరుగుతున్న వన్డే సీరిస్‌లోనే అదే ఆటతీరును కనబరుస్తున్నాడు. ఇప్పటికే మొదటి వన్డేలో సెంచరీ సాధించి ఆరుసార్లు 150కి పైగా పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇదివరకు ఈ రికార్డు సచిన్ పేరిట( ఐదు సార్లు) ఉండేది. 
 
team india vice captain Rohit Sharma eyes Sachin Tendulkars sixes record
Author
Visakhapatnam, First Published Oct 23, 2018, 7:42 PM IST

ప్రస్తుతం టీంఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఫామ్ లో ఉన్నాడు. విధేశాల్లోనే కాదు స్వదేశంలోనూ రాణిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. ధనా  ధన్ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించడంలో రోహిత్ ముందుటాడు. మొన్న ఆసియా కప్ లో అదరగొట్టే ప్రదర్శన చేసిన రోహిత్  ప్రస్తుతం వెస్టిండిస్ తో జరుగుతున్న వన్డే సీరిస్‌లోనే అదే ఆటతీరును కనబరుస్తున్నాడు. ఇప్పటికే మొదటి వన్డేలో సెంచరీ సాధించి ఆరుసార్లు 150కి పైగా పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇదివరకు ఈ రికార్డు సచిన్ పేరిట( ఐదు సార్లు) ఉండేది. 

బుధవారం వైజాగ్ లో వెస్టీండీస్తో జరిగే రెండో వన్డేలో మరో సచిన్ రికార్డును బద్దలు కొట్టడానికి రోహిత్ సిద్దమయ్యాడు. అతడు మరో సిక్సర్ బాదితే సచిన్ టెండూల్కర్ రికార్డును  సమం చేస్తాడు. అంతే కాదు మొత్తంగా టీంఇండియా తరపున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకోనున్నాడు. 

గత మ్యాచ్ లో సెంచరీ చేయడంలో భాగంగా రోహిత్ ఎనిమిది సిక్సర్లు బాదాడు.  ఇలా రోహిత్ తన వన్డే కెరీర్‌లో మొత్తం 194 సిక్సర్లు కొట్టి మాజీ కెప్టెన్ గంగూలీని(190 సిక్సర్లు) వెనక్కి నెట్టాడు. దీంతో అత్యదిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో వున్న రోహిత్ మూడో స్థానానికి ఎగబాకాడు. ఇప్పుడు మరో సిక్స్ బాదితే సచిన్ ను సమం చేయడం...అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొడితే వెనక్కి నెట్టి రెండో ఆటగాడిగా నిలుస్తాడు.

ప్రస్తుతం వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత క్రికెటర్ల జాబితాలో మహేంద్ర సింగ్‌ ధోని (217) తొలి స్థానంలో ఉన్నాడు. అతడి తర్వాత వరుసగా సచిన్, రోహిత్ లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios