Asianet News TeluguAsianet News Telugu

ఆసియా కప్: హార్దిక్ పాండ్యా కాన్ఫిడెన్స్‌కు సలామ్.. మీమ్‌ల వరద.. స్మృతి ఇరానీ రియాక్షన్ ఇదే!

ఆసియా కప్‌లో పాకిస్తాన్ పై భారత విజయాన్ని ఇంకా పౌరులు సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా హార్డిక్ పాండ్యాపై మీమ్‌లు వైరల్ అవుతున్నాయి. ఇందుకు కేంద్ర మంత్రి స్మతి ఇరానీ కూడా మినహాయింపేమీ కాదు. ఆమె కూడా ఓ కామెంట్‌తో పోస్టు పెట్టారు.
 

smriti irani comments on a post hardik pandya viral meme in instagram a moment in ind pak cricket t20 match in asia cup
Author
First Published Aug 29, 2022, 2:34 PM IST

న్యూఢిల్లీ: ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ ఆరంభం మ్యాచ్ అదిరిపోయింది. సగటు క్రికెట్ అభిమాని ఈ మ్యాచ్ అయిపోయే వరకు టీవీ తెరలకు కళ్లను అప్పగించి ఉంటారంటే అతిశయోక్తి కాదు. దాయాది దేశంతో పోరు అంటే రెండు దేశాల్లోనూ క్రేజ్ మామూలుగా ఉండదు. ఆదివారం ఈ మ్యాచ్ ఆసాంతం నరాలు తెగే ఉత్కంఠతో సాగింది. చివరి ఓవర్ వరకు ఇరు జట్లకు గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా సాగడంతో మ్యాచ్ పై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు హార్దిక్ పాండ్యా చివరి ఓవ్‌లో సిక్స్ బాది విజయాన్ని అందించాడు. భారత ప్రజలు ఈ క్రికెట్ మ్యాచ్ విందును ఎంజాయ్ చేశారు. చివరి వరకు టీమ్ భారాన్ని మోసిన హార్దిక్ పాండ్యా నెట్టింట్లో హీరో అయ్యాడు. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ పై మీమ్‌ల వరద వచ్చింది.

మ్యాచ్ చివరి ఓవర్. భారత విజయానికి నాలుగు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సి ఉన్నది. మొహమ్మద్ నవాజ్ బౌలింగ్ వేస్తున్నాడు. క్రీజ్‌లో హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తిక్‌లు ఉన్నారు. హార్దిక్ పాండ్యా స్ట్ర్రైక్. ఆ సమయంలో దినేశ్ కార్తిక్ కేసి హార్దిక్ పాండ్యా ఓ లుక్ ఇచ్చాడు. ఆ లుక్‌లో కాన్ఫిడెన్స్ మెరిసింది. అంతా నేను చూసుకుంటా.. అన్ని నా కంట్రోల్‌లో ఉన్నాయి అన్నట్టుగా హార్దిక్ పాండ్యా తల ఊపాడు. ఆ వెంటనే హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టి భారత క్రికెట్ జట్టుకు విజయం అందించారు. హార్దిక్ పాండ్యా కాన్ఫిడెంట్‌గా దినేశ్ కార్తిక్ కేసి తల ఊపుతున్న షార్ట్ వీడియో మీమర్‌లకు పసందైన విందు వడ్డించినట్టు అయింది.

చాలా మంది ఆ షార్ట్ వీడియోను షేర్ చేస్తే తమదైన కామెంట్ జోడించారు. మీమర్లకైతే పండుగే అయింది. ఈ సంబురాల్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా పాల్గొన్నారు. ఆమె ఈ షార్ట్ వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ ఓ కామెంట్ పెట్టారు.

ఇన్‌స్టాలో హార్డిక్ పాండ్యా వీడియో షేర్ చేస్త స్మృతి ఇరానీ ఇలా వ్యాఖ్యానించారు. ‘ఈ రోజు సోమవారం అని వారన్నప్పుడు’ అని పేర్కొన్నారు. ఈ పోస్టు కూడా అనతికాలంలో ఎక్కువగా రీచ్ అయింది. చాలా మంది కామెంట్లు పెట్టారు. చాలా మంది హార్దిక్ పాండ్యా కాన్ఫిడెన్స్‌ను కొనియాడారు. రాజకీయ నేతలకు ఆదివారమైనా.. సోమవారమైనా పెద్దగా తేడా ఏమీ ఉండదు అని మరో యూజర్ కామెంట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios