సిడ్నీ: ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించిన తర్వాత టీమిండియా కోచ్ రవిశాస్త్రి నోరు జారారు. దాంతో తీవ్ర దుమారం చెలరేగింది. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ని భారత్ 2-1 తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే. 

భారత్ ఘన విజయంపై టీమిండియా క్రికెటర్లపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే, ఈ స్థితిలో కోచ్ రవిశాస్త్రి చేసిన ఓ వ్యాఖ్యపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నాలుగో టెస్టు మ్యాచ్ విజయం తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
 
"నేను ఈ విషయం గతంలోనే చెప్పాను.. ఈ జట్టు విజయాన్ని సాధించేందుకు.. ఏ శిఖరం నుంచి దూకేందుకైన సిద్ధపడుతోంది. అది వాళ్లకి ఆటపై ఉన్న ప్రేమ" అని ఆయన అన్నారు. ఈ జట్టు ఎంత పటిష్టంగా ఉందంటే.. గతంలో ఉన్న ఏ భారత క్రికెట్ జట్టుతో అయినా చూసి.. ఇదిగో తమదే సరైన టెస్ట్ జట్టు అని గర్వంగా చెప్పొచ్చునని అన్నారు. 

దాని కోసం దాదాపు 12 నెలల నుంచి ప్రతీ ఆటగాడు కష్టపడుతున్నాడని, ఇప్పుడు తనకు ఎంతో సంతృప్తిగా ఉందని, ఇది 1983 ప్రపంచకప్ కన్నా 1985 వరల్డ్ ఛాంపియన్‌షిప్ విజయం కన్నా ఎంతో పెద్ద విజయమని ఆయన అన్నారు.
 
ఆ వ్యాఖ్యలపై వివాదం చెలరేగుతోంది.  టీమిండియా సాధించిన ఈ ఘనతను కచ్చితంగా ప్రశంసించాలని గానీ ఇతరులను కించపరుస్తూ కాదని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. టీం ఇండియా ఆటగాళ్లు మైదానంలో కష్టపడితే.. రవిశాస్త్రి కేవలం డ్రెస్సింగ్ రూంలో మాత్రమే కష్టపడ్డాడని మరొకరు సెటైర్ వేశాడు. 

సంబంధిత వార్తలు

పంత్ ప్లాన్ చేశాడు...పుజారా తడబడ్డాడు:గెలుపు సంబరాలపై కోహ్లీ (వీడియో)

ఆసీస్ గడ్డపై భారత్ చారిత్రక విజయం.. బ్యాట్స్‌మెన్ల పాత్ర ఎంత..?

నా జీవితంలో బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ ఇదే.. కోహ్లీ

72 ఏళ్ల నిరీక్షణ తర్వాత...భారత్‌‌కు దక్కిన ఆ విజయం

సిడ్నీ టెస్ట్: మ్యాచ్ డ్రా, ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత్

సిడ్నీ టెస్ట్: ముగిసిన నాలుగోరోజు ఆట.. 322 పరుగుల వెనుకబడ్డ ఆసీస్

మరీ ఇంతటి పతనమా...30 ఏళ్ల తర్వాత ఫాలో ఆన్ ఆడుతున్న ఆసీస్

సిడ్నీ టెస్టు: రెండో ఇన్నింగ్సు ప్రారంభించిన ఆస్ట్రేలియా

‘‘పంత్.. ధోనీని దాటేస్తాడు’’

కేఎల్ రాహుల్ నిజాయితి... అంపైర్ ప్రశంసలు

సిడ్నీ టెస్టులో కోహ్లీకి అవమానం...

ఆసిస్ సెలెక్టర్లకు బుర్ర లేదు: విరుచుకుపడ్డ షేన్‌వార్న్

ధోని పాకిస్థాన్ రికార్డును బద్దలుగొట్టిన పంత్.... 12ఏళ్ల తర్వాత