భారత్‌తో జరుగుతున్న టెస్ట్ సీరిస్లో ఓటమివైపు సాగుతున్నప్పటికి ఆస్ట్రేలియా సెలెక్టర్లకు ఇంకా బుద్ది రావడం లేదంటూ ఆసిస్ మాజీ ఆటగాడు షెన్ వార్న్ ద్వజమెత్తాడు. ఇలాంటి సమయంలో కూడా వన్డే సీరిస్ కోసం సరైన జట్టును ఎంపిక చేయలేదంటూ విరుచుకుపడ్డాడు. భారత్ తో వన్డే సీరిస్‌‌లో తలపడనున్న ఆస్ట్రేలియా జట్టును ఇవాళ ప్రకటించారు. దీనిపై స్పందిస్తూ షేన్ వార్న్ ఆసిస్ సెలెక్టర్లపై తీవ్ర విమర్శలు చేశారు.

చాలా కాలంగా జట్టులో స్థానం కోల్పోయిన  ఆటగాళ్లను ఈ వన్డే సీరిస్ కు సెలెక్ట్ చేయడం వార్న్ కోపానికి కారణమైంది. గత రెండేళ్లుగా ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడని ఉస్మాన్ ఖవాజాతో పాటు గత ఆరు నెలలుగా జట్టుకు దూరంగా వున్న లియాన్ ఎంపిక చేయడం తనకు ఆశ్యర్యం కలిగించిందన్నారు. ఇక తొమ్మిదేళ్లుగా ఆస్ట్రేలియా తరపున ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడని సిడిల్ ను ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న వన్డే సీరిస్ కు ఎంపిక చేయడం ఏంటని వార్న్ ప్రశ్నించారు. 

ప్రస్తుతం ఆస్ట్రేలియా సెలెక్షన్ కమిటీ ప్రకటించిన వన్డే జట్టు బలంగా, మంచి పామ్ లో వున్న భారత్ ను ఓడించడం కష్టమని వార్న్ అన్నారు. ఆటగాళ్ల ఎంపికలో సెలెక్టర్లు తమ బుర్రలు ఉపయోగించలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ సమీకరణాలను పరిశీలించినా జట్టు కూర్పు సమతూకంతో లేదని..వన్డే ఫార్మాట్ కే కాదు ఏ పార్మాట్‌కు ఈ రకమైన జట్టు పనికిరాదని వార్న్ సూచించారు. 

ఈ నెల 12వ తేదీ నుండి భారత్-ఆస్ట్రేలియా మద్య వన్డే సీరిస్ ప్రారంభం కానుంది. టెస్ట్ సీరిస్ లో ఆసిస్ జట్టు విఫలమవడంతో వన్డే సీరిస్ కోసం ప్రకటించిన జట్టులో భారీ  మార్పులు చేశారు. 
 
వన్డే సీరిస్ కోసం ప్రకటించిన ఆసిస్ జట్టిదే: అరోన్ ఫించ్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, పీటర్ హ్యాండ్స్‌కోబ్, మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయిన్స్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ, రిచర్డ్‌సన్, బిల్లీ స్టాన్‌లేక్, జాసన్ బెహ్రెండార్ఫ్, పీటర్ సిడెల్, నాథన్ లియాన్, ఆడం జంపా.