MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IND vs ENG : ఇంగ్లాండ్ ఖేల్ ఖతం.. ఫైనల్‌కు భారత్! వాంఖడేలో టీమిండియా జైత్రయాత్ర

IND vs ENG : ఇంగ్లాండ్ ఖేల్ ఖతం.. ఫైనల్‌కు భారత్! వాంఖడేలో టీమిండియా జైత్రయాత్ర

IND vs ENG : ముంబైలోని వాంఖడే స్టేడియం భారత్ విజయనాదంతో మార్మోగిపోయింది. టీ20 ప్రపంచ కప్ 2026 రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 05 2026, 11:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ముంబైలో భారత్ జైత్రయాత్ర.. ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ ఖేల్ ఖతం
Image Credit : X/BCCI

ముంబైలో భారత్ జైత్రయాత్ర.. ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ ఖేల్ ఖతం

వాంఖడేలో భారత్ విశ్వరూపం.. ఇంగ్లాండ్ పై సంజూ శాంసన్ సునామీ.. 253 పరుగుల భారీ లక్ష్యంతో బ్రిటిష్ జట్టు గుండెల్లో వణుకు పుట్టించింది టీమిండియా. ఉత్కంఠ పోరులో 7 పరుగుల తేడాతో విజయం సాధించి 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది భారత్. ముంబై లో ఇంగ్లాండ్ ఖేల్ ఖతం.. ఇక అహ్మదాబాద్‌లో భారత్ ఫైనల్ వేట మొదలు !

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 రెండో సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్‌పై 7 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించి ఘనంగా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో చివరి బంతి వరకు ఉత్కంఠ కొనసాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 253 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 246 పరుగుల వద్ద నిలిచిపోయింది.

25
శాంసన్ విధ్వంసం.. భారత్ భారీ స్కోరు
Image Credit : X/BCCI

శాంసన్ విధ్వంసం.. భారత్ భారీ స్కోరు

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకోగా, భారత్‌కు ఆదిలోనే అభిషేక్ శర్మ (9) రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. అయితే, ఓపెనర్ సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 42 బంతుల్లోనే 89 పరుగులు (8 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసి ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అతనికి ఇషాన్ కిషన్ (39), శివం దూబే (43) అద్భుత సహకారం అందించారు. చివర్లో హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచి 61 పరుగులు సమర్పించుకున్నాడు.

Related Articles

Related image1
భయ్యా.. సంజూ కొడితే ఎలా ఉంటుందో చూశారా ! ఇంగ్లాండ్ బౌలర్లకు పట్టిన సంజూ గ్రహణం
Related image2
IND vs ENG : టీ20 వరల్డ్ కప్ హిస్టరీనే తిరగరాసిన భారత్ ! ఒకే మ్యాచ్‌లో ఇన్ని రికార్డులా
35
బౌలింగ్‌లో బుమ్రా, పాండ్యా పంజా
Image Credit : X@bcci

బౌలింగ్‌లో బుమ్రా, పాండ్యా పంజా

254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను భారత బౌలర్లు ఆదిలోనే దెబ్బతీశారు. హార్దిక్ పాండ్యా తన మొదటి బంతికే ప్రమాదకరమైన ఫిల్ సాల్ట్‌ (5)ను అవుట్ చేసి భారత్‌కు శుభారంభం ఇచ్చాడు. అనంతరం జస్ప్రీత్ బుమ్రా తన మొదటి బంతికే హ్యారీ బ్రూక్‌ (7)ను అవుట్ చేసి ఇంగ్లాండ్‌ను కష్టాల్లోకి నెట్టాడు. బట్లర్ (25) కాసేపు పోరాడినా వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఒక దశలో ఇంగ్లాండ్ 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.

45
జాకబ్ బెథెల్ దుమ్మురేపాడు అంతే..
Image Credit : Getty

జాకబ్ బెథెల్ దుమ్మురేపాడు అంతే..

వరుసగా వికెట్లు పడుతున్నా, యంగ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన బెథెల్, ఇంగ్లాండ్‌కు గెలుపు ఆశలు రేకెత్తించాడు. అతను మొత్తం 48 బంతుల్లో 105 పరుగులు చేసి భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో అదరగొట్టాడు. విల్ జాక్స్ (35)తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే 20వ ఓవర్ మొదటి బంతికి బెథెల్ రన్ అవుట్ కావడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది.

55
చివరి ఓవర్ డ్రామా.. భారత్ విజయం
Image Credit : Getty

చివరి ఓవర్ డ్రామా.. భారత్ విజయం

చివరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి 30 పరుగులు అవసరమవ్వగా, శివం దూబే బౌలింగ్‌కు వచ్చాడు. క్రీజులో ఉన్న జోఫ్రా ఆర్చర్ మూడు సిక్సర్లు బాదినప్పటికీ, ఇంగ్లాండ్ లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లాండ్ 246/7 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా, బుమ్రా, అర్ష్‌దీప్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో భారత్ అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG : టీ20 వరల్డ్ కప్ హిస్టరీనే తిరగరాసిన భారత్ ! ఒకే మ్యాచ్‌లో ఇన్ని రికార్డులా
Recommended image2
భయ్యా.. సంజూ కొడితే ఎలా ఉంటుందో చూశారా ! ఇంగ్లాండ్ బౌలర్లకు పట్టిన సంజూ గ్రహణం
Recommended image3
IND vs ENG : భయ్యా.. ఇది భారత్ పవర్‌ అంటే ! ఇంగ్లాండ్ ను చెడుగుడు ఆడుకున్నారు !
Related Stories
Recommended image1
భయ్యా.. సంజూ కొడితే ఎలా ఉంటుందో చూశారా ! ఇంగ్లాండ్ బౌలర్లకు పట్టిన సంజూ గ్రహణం
Recommended image2
IND vs ENG : టీ20 వరల్డ్ కప్ హిస్టరీనే తిరగరాసిన భారత్ ! ఒకే మ్యాచ్‌లో ఇన్ని రికార్డులా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved