బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ టెస్ట్ డ్రాగా ముగియడంతో సిరీస్ 2-1 తేడాతో భారత్ వశమైంది. దీంతో భారత్ 72 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. 1940వ దశకంలో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత జట్టు.. ఆసీస్‌ను సొంతగడ్డపై ఓడించి టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఆ తర్వాత ఆస్ట్రేలియాను సొంతగడ్డపై ఓడించడం భారత్‌కు సాధ్యపడలేదు. 1980-81, 1985-86, 2003-04 పర్యటనల్లో సిరీస్‌ను డ్రా చేసుకుంది.. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో భారత్‌కు 7 విజయాలు దక్కాయి.

సిరీస్‌ను 3-1 తేడాతో గెలవాలన్న కోహ్లీ సేన ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. నాలుగో రోజుకే మ్యాచ్ భారత్ వైపుకి తిరిగినప్పటికీ.. మధ్యలో వర్షం పడటంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది.

తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు అలౌటైన ఆసీస్‌ 322 పరుగులు వెనుకబడింది..దీంతో టీమిండియా ఆసీస్‌ను ఫాలోఆన్‌కు ఆహ్వానించింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన తర్వాత వెలుతురులేమి కారణంగా నాలుగో రోజు ఆటను నిలిపివేశారు.

ఆ సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది.  చివరి రోజు వర్షం ఏమాత్రం తెరిపినివ్వకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో 2-1 తేడాతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ భారత్ వశమైంది. ఈ సిరీస్‌లో మూడు సెంచరీలతో టాప్ స్కోరర్‌గా నిలిచిన పుజారా మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

సిడ్నీ టెస్ట్: మ్యాచ్ డ్రా, ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత్

సిడ్నీ టెస్ట్: ముగిసిన నాలుగోరోజు ఆట.. 322 పరుగుల వెనుకబడ్డ ఆసీస్

మరీ ఇంతటి పతనమా...30 ఏళ్ల తర్వాత ఫాలో ఆన్ ఆడుతున్న ఆసీస్

సిడ్నీ టెస్టు: రెండో ఇన్నింగ్సు ప్రారంభించిన ఆస్ట్రేలియా

‘‘పంత్.. ధోనీని దాటేస్తాడు’’

కేఎల్ రాహుల్ నిజాయితి... అంపైర్ ప్రశంసలు

సిడ్నీ టెస్టులో కోహ్లీకి అవమానం...

ఆసిస్ సెలెక్టర్లకు బుర్ర లేదు: విరుచుకుపడ్డ షేన్‌వార్న్

ధోని పాకిస్థాన్ రికార్డును బద్దలుగొట్టిన పంత్.... 12ఏళ్ల తర్వాత