సిడ్నీ: సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ అదరగొట్టాడు. దాంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్సులు 300 పరుగుల వద్ద ముగిసింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్సు స్కోరుపై ఆస్ట్రేలియా 322 పరుగుల వెనుకంజలో ఉంది. 

భారత్ ఏడు వికెట్ల నష్టానికి 622 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్సును డిక్లేర్ చేసింది. ఆ తర్వాత తన తొలి ఇన్నింగ్సును ప్రారంభించిన ఆస్ట్రేలియా 300 పరుగులకు కుప్పకూలింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లో హరీష్ (79) మాత్రమే రామించాడు. మిగతా బ్యాట్స్ మెన్ భారత బౌలర్ల ముందు చేతులెత్తేశారు. 

కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు తీసుకుని ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. షమీ, జడేజాలకు తలో రెండు వికెట్లు పడ్డాయి. బుమ్రా 1 వికెట్ తీశాడు. మూడో టెస్టులో మాదిరిగా కాకుండా ఈ టెస్టు మ్యాచులో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాకు ఫాలో ఆన్ ఇచ్చాడు. దీంతో ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్సును ప్రారంభించింది.

సంబంధిత వార్తలు

సిడ్నీ టెస్ట్: బౌలర్ల జోరును అడ్డుకున్న వర్షం...అయినా మూడోరోజు భారత్‌దే

ధోని పాకిస్థాన్ రికార్డును బద్దలుగొట్టిన పంత్.... 12ఏళ్ల తర్వాత

బ్యాటింగ్ తో దుమ్మురేపిన పంత్.. అభిమానుల పాట

రికార్డ్ బ్రేక్: ధోనీ వల్ల కానిది పంత్ సాధించాడు

సిడ్నీ టెస్ట్: 622 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్

సిడ్నీ టెస్ట్: ముగిసిన తొలి రోజు ఆట, భారత్ 303/4

మయాంక్ రికార్డుల మోత

సచిన్ ముందు, వెనుక స్థానాలు పుజారావే...

పింక్ గ్లౌవ్స్, బ్యాట్‌తో బరిలోకి దిగిన కోహ్లీ ...విశేషమేంటబ్బా?

నల్లటి బ్యాడ్జీలతో గ్రౌండ్‌లోకి దిగిన ఆసీస్, భారత్ క్రికెటర్లు...ఎందుకంటే

పుజారా రికార్డు: దిగ్గజాల జాబితాలో చోటు